News February 8, 2025

కాంగ్రెస్ దుస్థితి: జీరో, జీరో.. మరో జీరో లోడింగ్!

image

ఢిల్లీ అసెంబ్లీకి 1952-2020 మధ్య ఎనిమిదిసార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 4సార్లు గెలిచింది. అలాంటి పార్టీ ఇప్పుడు అక్కడ ఖాతా తెరవడానికి ఆపసోపాలు పడుతోంది. 2015, 2020 ఎన్నికల్లో సున్నాకే పరిమితమైన గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఈసారీ పేలవ ప్రదర్శన చేస్తోంది. కేవలం ఒకేఒక్కచోట స్వల్ప ఆధిక్యతతో ఊగిసలాడుతోంది. పూర్తి కౌంటింగ్ ముగిసే సమయానికి ఆ స్థానమూ డౌటేనని అంచనా. దీంతో హ్యాట్రిక్ డకౌట్ ఖాయంగా కనిపిస్తోంది.

Similar News

News November 6, 2025

గోరింటాకు ధరించడం వెనుక శాస్త్రీయత

image

పెళ్లిళ్లు, పండుగలప్పుడు ఆడపిల్లలు గోరింటాకు ధరించడం తరతరాలుగా వస్తున్న ఆచారం. అయితే, ఈ ఆచారం వెనుక కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. గోరింటాకు అనేది ఓ ఔషధ మూలిక. పెళ్లి చేసుకున్నప్పుడు నూతన వధువులో సహజంగానే కాస్త భయం, ఆందోళన ఉంటుంది. ఆ ఫీలింగ్స్‌ను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. అలాగే శరీరాన్ని చల్లబరుస్తుంది. ఒంట్లో వేడిని తగ్గించి, నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది.

News November 6, 2025

నేడు బిహార్‌లో తొలి దశ ఎన్నికలు

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో(NOV 6, 11) పోలింగ్ జరగనుంది. ఇవాళ తొలి విడతలో భాగంగా 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో 3.75 కోట్ల మంది ఓటర్లు 16 మంది మంత్రులు సహా మొత్తం 1,314 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. రెండు విడతల పోలింగ్ అయ్యాక NOV 14న ఓట్లు లెక్కించనున్నారు.

News November 6, 2025

ఇవాళ అమరావతికి సీఎం చంద్రబాబు

image

సీఎం చంద్రబాబు లండన్ పర్యటన ముగిసింది. నిన్న రాత్రి 7.30 గంటలకు లండన్ నుంచి స్వదేశానికి తిరిగి పయనమయ్యారు. ఉదయం హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో అమరావతికి బయల్దేరనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో భేటీ కానున్నారు. డేటా డ్రివెన్ గవర్నెన్స్‌పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.