News February 8, 2025
HYD: జాగ్రత్తలతో అగ్ని ప్రమాదాలను నివారించవచ్చు
ముందస్తు జాగ్రత్తలతో అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని సీపీ సుధీర్ బాబు అన్నారు. రాచకొండ కమిషనరేట్‌లో డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విపత్తు నిర్వహణ చర్యల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సత్వర స్పందన ద్వారా నష్ట తీవ్రతను తగ్గించవచ్చని, అధికారులు సిబ్బంది విపత్తు నిర్వహణ విధానాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు.
Similar News
News February 8, 2025
ఢిల్లీలో AAP ఓటమికి కారణాలు
☞ కాంగ్రెస్‌తో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేయడం
☞ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ సహా కీలక నేతలు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర, సంజయ్ తదితర నేతలు జైలుకెళ్లడం
☞ కేజ్రీవాల్ జైలుకెళ్లాక AAPలో నాయకత్వ లోపం
☞ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా మెలగకపోవడం
☞ అభివృద్ధి, చెత్త తొలగించకపోవడం, మౌలిక సదుపాయాలు కల్పించకుండా BJPపై పదేపదే విమర్శలు చేస్తుండటం
☞ పదేళ్ల AAP పాలన చూశాక, బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఓటర్ల ఆలోచన
News February 8, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.150 పెరిగి రూ.79,450లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.160 పెరగడంతో రూ.86,670 పలుకుతోంది. కాగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,07,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
News February 8, 2025
సిద్దిపేట: ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
సిద్దిపేట జిల్లా చేగుంట, గజ్వేల్ రహదారి పై నర్సపల్లి చౌరస్తా వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. మృతులు దౌల్తాబాద్ మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. రోడ్డు దాటుతున్న బైక్‌ను లారీ ఢీ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.