News March 19, 2024
సింహాచలం: మే 10న జరిగే చందనోత్సవంపై సమీక్ష

సింహాచలం ఆలయంలో మే 10వ తేదీన నిర్వహించనున్న చందనోత్సవం పై మంగళవారం వివిధ శాఖల అధికారులతో ఈఓ శ్రీనివాసమూర్తి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాదాయశాఖ కమిషనర్ సూచించిన మార్గదర్శకాలను వివరించారు. ముఖ్యంగా కొండపైన ట్రాఫిక్ నియంత్రణ పోలీస్ బందోబస్తు క్యూలైన్ల ఏర్పాటు తదితర విషయాలపై అధికారులతో ఈఓ చర్చించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ పాల్గొన్నారు.
Similar News
News January 8, 2026
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి ఘన స్వాగతం

భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురువారం విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశురాం రాజు స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన బయలుదేరి విశాఖలోని తన నివాసానికి చేరుకున్నారు. ఆయనను కలిసిన వారిలో పలువురు బీజేపీ నేతలు ఉన్నారు.
News January 8, 2026
విశాఖలో రేపు డీఆర్సీ సమావేశం

విశాఖలో డీఆర్సీని జనవరి 9న నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఇన్‌ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఈ సమీక్షలో పాల్గొననున్నారు. పక్కా నివేదికలతో అధికారులు హాజరు కావాలని ఆయన ఆదేశించారు. అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, గతంలో చర్చించిన సమస్యలకు తీసుకున్న పరిష్కార చర్యలను తెలుపుతూ నివేదికలు తీసుకురావాలన్నారు. ప్రజా ప్రతినిధులు అడిగే ప్రశ్నకు సమాధానం ఇచ్చేలా ఉండాలని సూచించారు.
News January 8, 2026
విశాఖ మీదుగా వెళ్లే ‘వివేక్ ఎక్స్‌ప్రెస్’ రీషెడ్యూల్

కన్యాకుమారి – దిబ్రూగఢ్ వివేక్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22503) నేడు (08.01.2026) రీషెడ్యూల్ చేయబడింది. సాయంత్రం 5:25 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు రాత్రి 9 గంటలకు బయలుదేరుతోంది. దీనివల్ల రేపు రాత్రి 11.50 గంటలకు విశాఖపట్నం చేరుకోవాల్సిన ఈ రైలు సుమారు 4 గంటల ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.


