News February 8, 2025
17 మంది అభ్యర్థులు-23 సెట్ల నామినేషన్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738988566435_710-normal-WIFI.webp)
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి నామినేషన్లు ఊబందుకున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 13 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 17 మంది అభ్యర్థులు 23 సెట్లు నామినేషన్లు వేశారు. ఈరోజు, రేపు సెలవు ఉండడంతో నామినేషన్‌కు 10న ఒక్క రోజే గడువు ఉంది.
Similar News
News February 8, 2025
ఖట్టర్ ఇమాందార్.. ఇమేజ్ ఖతం!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739005217409_1199-normal-WIFI.webp)
లూజు ప్యాంటు. పొడవు చొక్కా. జేబులో రెనాల్డ్స్ పెన్ను. తలకు మఫ్లర్. పర్ఫెక్టుగా డిజైన్ చేసుకున్న సామాన్యుడి ఇమేజ్. ప్రజల డబ్బుకు ఖట్టర్ ఇమాందార్‌గా ఉంటానని ప్రతిజ్ఞ. అవినీతి రహిత రాజకీయాలు చేస్తానన్న హామీతో వరుసగా 3సార్లు గెలుపు. కట్‌చేస్తే శీశ్‌మహల్లో గోల్డ్ ప్లేటెడ్ కమోడ్. వేగనార్ పోయి బెంజ్ వచ్చే. లిక్కర్, వాటర్ స్కాములు. అవినీతి ఆరోపణలు. జైల్లోనూ పదవిపై వ్యామోహం. కళంకిత ఇమేజ్‌తో AKకు శరాఘాతం!
News February 8, 2025
ఓటర్లను ఆకర్షించిన BJP హామీలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739006763059_782-normal-WIFI.webp)
అన్ని రంగాలను ప్రభావితం చేసేలా BJP ప్రకటించిన మ్యానిఫెస్టో ఆ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించింది. మహిళలకు నెలకు రూ.2,500, పేదలకు సబ్సిడీపై రూ.500కే గ్యాస్ సిలిండర్, గర్భిణులకు రూ.21,000 ఇస్తామన్న BJPని ప్రజలు నమ్మారు. గిగ్ వర్కర్లతో పాటు వివిధ రంగాల్లో పని చేసే కార్మికులకు రూ.10లక్షల లైఫ్ ఇన్సూరెన్స్, ఢిల్లీలోని 1,700 అనధికార కాలనీ వాసులకు ఆస్తి హక్కులు, తదితర హామీలు ఓట్లు కురిపించాయి.
News February 8, 2025
ఆర్మూర్: అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739007892306_51712009-normal-WIFI.webp)
అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని శనివారం పరిశీలించారు. సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. సంపంగి నరసయ్య(41) తన ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడని చెప్పారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు సీఐ వివరించారు.