News February 8, 2025

సూర్యాపేట: మహిళ హత్య.. నిందితుడికి జీవిత ఖైదు

image

మహిళ హత్య కేసులో ఓ వ్యక్తికి NLG జిల్లా 2వ అదనపు కోర్టు జడ్జి రోజారమణి గురువారం జీవిత ఖైదు విధించారు. చివ్వెల(M)కి చెందిన విజయకు కర్నూలు జిల్లాకు చెందిన మూజువర్ నూర్ మహ్మద్‌తో పరిచయమైంది. వారు కొంతకాలం సహజీవనం చేయగా ఆమెకు వేరొకరితో సంబంధం ఉందని అనుమానించిన మహ్మద్ 2014జూన్6న కనగల్(M) పర్వతగిరి వద్ద ఆమెను హత్య చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా జడ్జి పైవిధంగా తీర్పునిచ్చారు.

Similar News

News February 8, 2025

32 ఏళ్ల తర్వాత ఢిల్లీలో BJPకి 47% ఓటుషేర్

image

ఢిల్లీ ఎన్నికల్లో BJP విజయానికి పెరిగిన ఓటు షేరే కారణం. 32 ఏళ్ల తర్వాత ఆ పార్టీ 47% ఓటుషేర్ సాధించింది. 1993లో 47.82% ఓట్లు పొందిన కాషాయ దళం మళ్లీ 2025లో 47% సాధించడం గమనార్హం. 1998లో 34.02, 2003లో 35.22, 2008లో 36.34, 2013లో 33.00, 2015లో 32.30, 2020లో 38.51 శాతంతోనే సరిపెట్టుకుంది. చివరి రెండు లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువే పొందినా అసెంబ్లీలో అందుకోకపోవడంతో ఢిల్లీ పీఠం అందని ద్రాక్షగా మారింది.

News February 8, 2025

మరుట్లలో 400 చీనీ చెట్లకు నిప్పు

image

కూడేరు మండలంలోని మరుట్ల రెండో కాలనీ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు చిన్నకొండప్ప గారి శ్రీనివాస్ నాయుడు తోటలో శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో 400 చీనీ చెట్లు దగ్ధమయ్యాయి. డ్రిప్ పరికరాలు, పైప్లైన్ గేట్ వాల్స్ మొత్తం కాలి బూడిద అయ్యాయి. దాదాపుగా రూ.4 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధిత రైతు తెలిపాడు.

News February 8, 2025

అబిడ్స్ DIపై భార్య ఫిర్యాదు

image

అబిడ్స్ పోలీస్ స్టేషన్ డీఐ నరసింహపై ఆయన భార్య సంధ్య హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. పెళ్లై 12 ఏళ్లు అవుతుందని, తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, అదనపు కట్నం ఇవ్వకపోతే రెండో పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

error: Content is protected !!