News February 8, 2025
EC డేటా: BJP 40, AAP 30
ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ప్రకారం ఢిల్లీ ఫలితాల్లో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. మొత్తం 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మెజారిటీ మార్క్ 36 కన్నా ఇది 7 స్థానాలు ఎక్కువ. ఆమ్‌ఆదీ పార్టీ 30 సీట్లతో ముందుకు సాగుతోంది. బీజేపీ ఓట్ షేరు 48.03 శాతంగా ఉంది. ఆప్ 42.58 శాతం సాధించింది. కాంగ్రెస్‌కు 6.74% ఓట్‌షేర్ రావడం గమనార్హం.
Similar News
News February 8, 2025
0..0..0: ఢిల్లీలో కాంగ్రెస్ హ్యాట్రిక్ డకౌట్
దేశ రాజధాని ఢిల్లీ ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కనీసం 40% ఓటుషేర్ సంపాదించేది. మాజీ CM షీలాదీక్షిత్ నాయకత్వంలో వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న పార్టీ. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. వరుసగా మూడో సారీ ఖాతా తెరవకుండా హ్యాట్రిక్ డకౌట్ రికార్డు ఖాతాలో వేసుకుంది. క్రితంసారి 3% ఓటుషేర్ సాధించిన హస్తం పార్టీ ఈసారి 7 శాతంతో ఆనందపడాల్సి వస్తోంది. ఆ పార్టీ దుస్థితిపై మీ కామెంట్.
News February 8, 2025
బీజేపీ ఘన విజయం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ 36 స్థానాల మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. మరో 11 చోట్ల లీడింగ్‌లో కొనసాగుతోంది. దీంతో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగిరింది. అటు ఆప్ 19 స్థానాల్లో గెలిచి 4 చోట్ల ఆధిక్యంలో ఉంది.
News February 8, 2025
ఢిల్లీ ప్రజలు అభివృద్ధి, సుపరిపాలనకు ఓటేశారు: మోదీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం పొందడంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘జనశక్తి ప్రధానం. అభివృద్ధి, సుపరిపాలనను గెలిపించారు. ఈ చరిత్రాత్మక విజయాన్ని అందించిన ఢిల్లీలోని నా ప్రియమైన సోదర, సోదరీమణులకు సెల్యూట్. ఢిల్లీని అభివృద్ధి చేయడంలో, ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో, వికసిత్ భారత్‌ను నిర్మించడంలో ఢిల్లీ ప్రధాన పాత్ర పోషించే విధంగా పనిచేస్తామని హామీ ఇస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.