News February 8, 2025
హనుమకొండ: గ్రామాల్లో మొదలైన ‘స్థానిక’ సందడి!

ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నాయి. దీంతో హనుమకొండ జిల్లాలోని గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ఆశావహులు మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్య నేతలను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది.
Similar News
News March 22, 2026
జిల్లాలో నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ కసరత్తు

భద్రాద్రి జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీకి కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు ముమ్మరం చేసింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన వారు, ఎన్నికల ముందు చేరి గెలుపునకు కృషి చేసిన నేతల వివరాలను సేకరిస్తోంది. త్వరలోనే పదవుల ప్రకటన ఉండే అవకాశం ఉండటంతో అంతర్గతంగా వడపోత సాగిస్తోంది. ఏళ్ల తరబడి జెండా మోసిన కార్యకర్తలకే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆశావహుల ప్రయత్నాలు పెరిగాయి.
News March 22, 2026
JGTL: జీవన్ రెడ్డి వెంట వెళ్లేదెవరు.. అనుచరుల రహస్య సమావేశాలు!

మాజీమంత్రి జీవన్ రెడ్డి BRSలో చేరడం దాదాపు ఖాయమైంది. ఈ మేరకు ఆయన అనుచర వర్గంతో వరుస చర్చలు జరుపుతున్నారు. అయితే 2 రోజులుగా జీవన్ రెడ్డి ముఖ్య అనుచరులు రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇన్నాళ్లు BRSకు, ఆ నాయకులకు వ్యతిరేకంగా పోరాటం చేసి మళ్లీ అదే పార్టీలో చేరడంపై కొంత ఆలోచనలో పడ్డారు. దీనిపై కొందరిని అడిగితే ఇంకా తాము పార్టీ మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొనడం కొసమెరుపుగా మారింది.
News March 22, 2026
‘పెద్ది’లో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్?

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే సాంగ్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ కపూర్ కూడా స్పెషల్ సాంగ్‌లో స్క్రీన్ షేర్ చేసుకుంటారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ప్రస్తుతం మృణాల్ తెలుగులో అడివి శేష్‌తో కలిసి ‘డెకాయిట్’ మూవీలో నటిస్తున్నారు.


