News February 8, 2025

ఢీల్లీ ఎన్నికల ఫలితాలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

image

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో BJP విజయం దిశగా దూసుకెళ్తోంది. అయితే, ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర సహాయ మంత్రి, KNR MP బండి సంజయ్ స్పందించారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆప్‌ను ఊడ్చేశారని అన్నారు. కుంభకోణాలు, జైలు పార్టీలు మాకు వద్దని ఢిల్లీ ప్రజలు వద్దనుకుని BJPకి పట్టం కట్టారని పేర్కొన్నారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందే ఊహించామని అన్నారు. తెలంగాణలో కూడా BJP అధికారంలోకి వస్తుందని తెలిపారు.

Similar News

News March 18, 2026

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

♦ డయేరియా ఘటనపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: అచ్చెన్న
♦పాతపట్నం సమస్యలపై ప్రస్తావించిన ఎమ్మెల్యే గోవింద్
♦ టెక్కలి: భూములు ఇవ్వమంటూ రైతుల నిరసన
♦ జిల్లాలో దివ్యంగ శక్తి పథకం ప్రారంభం
♦శ్రీకాకుళం: మామిడి కాయలు కొరత
♦ నరసన్నపేట: జూనియర్ క్రీడా మైదానంలో నాగుపాము సంచారం
♦ టెక్కలి: రెండు నెలలలో ఇద్దరు కిడ్నీ రోగులు మృతి

News March 18, 2026

చీరాల 1 టౌన్ ఎస్ఐ భాస్కరరావు మృతి

image

చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న వల్లాగి భాస్కరరావు బుధవారం మృతిచెందారు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఆయనకు ఇంటి వద్ద హార్ట్‌ఎటాక్ వచ్చింది. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. డీఎస్పీ మొయిన్, సీఐలు సుబ్బారావు, అశోక్ కుమార్, మల్లికార్జునతో పాటు పోలీసులు నివాళులు అర్పించారు. ఆయన 42 ఏళ్ల నుంచి పోలీస్ విభాగంలో సేవలందించారన్నారు.

News March 18, 2026

రైతన్నల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి ఉత్తమ్

image

రాష్ట్ర ప్రజలకు మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఆశలు, లక్ష్యాలతో ప్రజలంతా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా రైతాంగానికి శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ ఏడాది వానలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని కోరారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.