News February 8, 2025

ఢీల్లీ ఎన్నికల ఫలితాలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

image

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో BJP విజయం దిశగా దూసుకెళ్తోంది. అయితే, ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర సహాయ మంత్రి, KNR MP బండి సంజయ్ స్పందించారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆప్‌ను ఊడ్చేశారని అన్నారు. కుంభకోణాలు, జైలు పార్టీలు మాకు వద్దని ఢిల్లీ ప్రజలు వద్దనుకుని BJPకి పట్టం కట్టారని పేర్కొన్నారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందే ఊహించామని అన్నారు. తెలంగాణలో కూడా BJP అధికారంలోకి వస్తుందని తెలిపారు.

Similar News

News February 8, 2025

ఉపఎన్నికల్లో అధికార పార్టీలదే హవా!

image

అయోధ్యలోని మిల్కిపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. ఎస్పీ అభ్యర్థి అజిత్ ప్రసాద్‌పై బీజేపీ క్యాండిడేట్ చంద్రభాను పాస్వాన్ 61,710 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఫైజాబాద్ లోక్‌సభ స్థానంలో ఓటమి తర్వాత ఈ విజయంతో బీజేపీకి ఊరట దక్కింది. మరోవైపు తమిళనాడు ఈరోడ్ ఈస్ట్ ఉపఎన్నికలో డీఎంకే అభ్యర్థి ఛాందీరకుమార్ విజయం దిశగా దూసుకెళ్తున్నారు.

News February 8, 2025

కర్రివలసలో వ్యక్తి ఆత్మహత్య

image

పాచిపెంట మండలం కర్రివలస గ్రామంలో దాసరి శంకరరావు(35) ఆత్మహత్య చేసుకున్నారని ఏఎస్సై బి.ముసలినాయుడు తెలిపారు. శనివారం మాట్లాడుతూ.. భార్యభర్తల మధ్య గొడవల కారణంగా శంకరరావు శుక్రవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసి విజయనగరం మహారాజ ఆసుపత్రికి రిఫర్ చేశారని, అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారన్నారు. భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

News February 8, 2025

BJP విజయానికి అసదుద్దీన్, MIM హెల్ప్!

image

BJP విజయంలో MIM పరోక్షపాత్రపై చర్చ జరుగుతోంది. ఆమ్‌ఆద్మీని మట్టికరిపించడంలో అసదుద్దీన్ ప్రభావం తోడైందంటున్నారు. ఢిల్లీలో ముస్లిములు గణనీయంగా ఉంటారు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా ఉన్న వీరు పదేళ్లుగా AAPకు ఓటేస్తున్నారు. ఈసారి పార్టీలన్నీ పొత్తుల్లేకుండా బరిలోకి బలమైన అభ్యర్థులనే దించడంతో ముస్లిముల ఓట్లు చీలాయి. MIMకు మొత్తం 80వేల ఓట్లు రావడం స్వల్ప మార్జిన్లతో చాలాచోట్ల BJPని గెలిపించింది.

error: Content is protected !!