News February 8, 2025
HYD: మాజీ రాష్ట్రపతికి సీఎం నివాళులు

మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు నివాళులు అర్పించారు. జాకీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీలు చామల కిరణ్ కుమార్, మల్లు రవి, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
Similar News
News March 7, 2026
నెల్లూరు మున్సిపల్ అధికారులు వార్నింగ్

నెల్లూరు నగరంలో రూ.44 కోట్ల పన్ను బకాయిలు పేరుకుపోవడంతో మున్సిపల్ అధికారులు సీరియస్ అయ్యారు. మార్చి 31 డెడ్ లైన్ కావడంతో, సుమారు 14,300 మంది మొండి బకాయిదారులకు లోక్ అదాలత్ నోటీసులు జారీ చేస్తున్నారు. గత ఏడాదిలా 50% రాయితీ వస్తుందని ఆశించి పన్ను ఆపేయవద్దని, అలా చేస్తే ఇంటి నల్లా కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా భారీ బకాయిలు ఉన్న హోటళ్లు, మాల్స్, ఇండస్ట్రీలపై నిఘా పెట్టారు.
News March 7, 2026
గుంటూరు: విద్యుత్ శాఖకు రూ.450 కోట్ల బకాయిలు

విద్యుత్ పంపిణీ సంస్థలకు బకాయిలు భారీగా పేరుకుపోయాయి. ఏపీ సీపీడీసీఎల్ పరిధిలో గుంటూరు, సీఆర్డీఏ, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కలిపి రూ.450 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గుంటూరు సర్కిల్‌లోనే రూ.203 కోట్లు బకాయి కాగా పల్నాడు ప్రాంతంలో రూ.250 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం ముగియడంతో ఈ వసూళ్లపై అధికారులు దృష్టి సారించారు. ప్రైవేటు వినియోగదారులకు నోటీసులు ఇస్తున్నారు.
News March 7, 2026
అల్లు అర్జున్‌తో శిల్పా రవి

అల్లు శిరీష్, నయనికా రెడ్డిల వివాహ వేడుకకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హాజరయ్యారు. పెళ్లి వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం, ఆయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కలిశారు. ఈ సందర్భంగా శిల్పా రవి దంపతులు అల్లు అర్జున్‌తో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


