News February 8, 2025

ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన వాలంటీర్

image

ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో సంచలనం నమోదైంది. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ శివ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. తనను మొదటి ప్రాధాన్యత ఓటుకు గెలిపించవలసిందిగా గ్రాడ్యుయేట్స్‌ని అభ్యర్థిస్తున్నాడు. నామినేషన్లు పూర్తయ్యేలోగా ఇంకా ఎన్ని సంచలానాలను నమోదు అవుతాయో చూడాలి.

Similar News

News March 21, 2026

YELLOW ALERT: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు!

image

TG: రాష్ట్రంలో 2 రోజులు అక్కడక్కడా మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు రోజులు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా ఉండే ఛాన్స్ ఉందంది. ఆ తర్వాత 3 రోజుల్లో క్రమంగా 3 డిగ్రీల మేర పెరుగుతాయని పేర్కొంది.

News March 21, 2026

కెనాల్ పనుల పురోగతిపై మంత్రి ఉత్తమ్ సమీక్ష

image

SLBC, డిండి ఎత్తిపోతల, అచ్చంపేట కెనాల్ పనుల పురోగతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. ఎస్ఎల్‌బీసీ ఇన్‌లెట్ తవ్వకాల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయని, ఇప్పటికే దేవరకొండ నుంచి ఔట్‌లెట్ పనులు మొదలైనట్లు స్పష్టం చేశారు. టన్నెల్‌లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. సొరంగంలో గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలని, ఆధునిక టెక్నాలజీతో తవ్వకాలు జరపాలని సూచించారు.

News March 21, 2026

పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: నెల్లూరు SP

image

రంజాన్ సందర్భంగా నెల్లూరు జిల్లా ముస్లిం సోదరులకు ఎస్పీ డాక్టర్ అజిత వెజెండ్ల శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర మాసంలో ఉపవాసాలు, ప్రార్థనలు, దానధర్మాలు ఎంతో గొప్పవని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు. పండగ సందర్భంగా మసీదులకు భారీగా వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని ఆదేశించారు.