News February 8, 2025

ఢిల్లీలో తొలి గెలుపు ఎవరిదంటే?

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి గెలుపు ఆమ్ ఆద్మీ పార్టీని వరించింది. కొండ్లీ నియోజకవర్గానికి చెందిన ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ తన సమీప అభ్యర్థి ప్రియాంక గౌతమ్‌(బీజేపీ)పై 6293+ ఓట్లతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం 12 రౌండ్లలో కౌంటింగ్ జరిగింది. ఆ తర్వాత లక్ష్మీనగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అభయ్ వర్మ విజయం సాధించారు.

Similar News

News February 8, 2025

కొత్త రేషన్ కార్డులకు ఈసీ బ్రేక్

image

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. కొత్త రేషన్ కార్డులకు మీసేవలో దరఖాస్తులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించగా.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా వాటిని తక్షణమే నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది.

News February 8, 2025

కాంగ్రెస్ దీనస్థితి చూస్తే జాలి కలుగుతోంది: కిషన్ రెడ్డి

image

అవినీతికి పాల్పడితే ఏం జరుగుతుందో ఢిల్లీ ఫలితాలే ఉదాహరణ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ‘అవినీతిపై పోరాటమంటూ కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చారు. చివరికి అతడే అవినీతికి చిరునామాగా మారారు. కాంగ్రెస్ దీనస్థితి చూస్తే అందరికీ జాలి కలుగుతోంది. ఢిల్లీలో వరుసగా 3 సార్లు డకౌట్ అయింది. అసలు గెలవాలనే ఆలోచన కాంగ్రెస్‌కు ఎప్పుడూ ఉండదు. మోదీని, BJPని ఓడించాలని మాత్రమే రాహుల్ ఆలోచిస్తారు’ అని విమర్శించారు.

News February 8, 2025

భారత జట్టుకు గుడ్‌న్యూస్

image

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేకు మోకాలి నొప్పి కారణంగా దూరమైన భారత జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రెండో వన్డేలో ఆడనున్నారు. కోహ్లీ ఫిట్‌గానే ఉన్నాడని, రెండో వన్డేకు అతడు సిద్ధమని భారత జట్టు బ్యాటింగ్ కోచ్ వెల్లడించారు. దీంతో కోహ్లీ కోసం జైస్వాల్‌ను తప్పిస్తారా? లేక శ్రేయస్ అయ్యర్‌ను పక్కనబెడతారా? అనేది తెలియాల్సి ఉంది. రేపు కటక్ వేదికగా మ.1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

error: Content is protected !!