News March 19, 2024

కృష్ణా: APSDMA అధికారుల ముఖ్య విజ్ఞప్తి

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్ క్రింద ఉండవద్దని ఆయన సూచించారు. పిడుగులు పడే సమయంలో సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలన్నారు.

Similar News

News March 18, 2026

కృష్ణా: పదో తరగతి హిందీ పరీక్షకు 233 మంది గైర్హాజరు

image

పదో తరగతి హిందీ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 21,312 మంది విద్యార్థులకు గాను 21,079 మంది పరీక్షకు హాజరయ్యారు. 233 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయ వర్గాలు తెలిపాయి. DLO 4, DEO 7, ACGE 5, డిస్ట్రిక్ట్ మోనటరింగ్ కో-ఆర్డినేటర్స్ 5, ఫ్లైయింగ్ స్క్వాడ్స్ 45 కేంద్రాలను తనిఖీ చేశాయి. ఓపెన్ స్కూల్ పరీక్షలకు సంబంధించి 598 మందికి 437 మంది హాజరయ్యారని తెలిపారు.

News March 18, 2026

పామర్రు: ‘పది’ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

పామర్రు జడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ డీకే బాలాజీ తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. పరీక్షా కేంద్రం వద్ద అధికారులు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరుగుతున్నాయని కలెక్టర్ చెప్పారు.

News March 18, 2026

కృష్ణా: గ్యాస్ సరఫరాలో సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

ఎల్‌పీజీ గ్యాస్ సిలెండర్ల సరఫరాలో నెలకొన్న ఇబ్బందుల దృష్ట్యా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. గ్యాస్ సరఫరాలో ఎటువంటి సమస్యలున్నా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 08672-242493కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ప్రతి రోజూ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని చెప్పారు.