News February 8, 2025
ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన వాలంటీర్

ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసేందుకు కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ శివ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. తనను మొదటి ప్రాధాన్యత ఓటుకు గెలిపించవలసిందిగా గ్రాడ్యుయేట్స్‌ని అభ్యర్థిస్తున్నాడు. నామినేషన్లు పూర్తయ్యేలోగా ఇంకా ఎంత మంది వేస్తారో చూడాలి.
Similar News
News October 23, 2025
విశాఖ: క్రికెట్ బెట్టింగ్ ముఠా సహాయకుల అరెస్ట్

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు ఇదివరకే క్రికెట్ బెట్టింగ్ కేసులో ముద్దాయిలను దర్యాప్తు చేశారు. దర్యాప్తులో మరో ఇద్దరిని గురువారం అరెస్ట్ చేశారు. ‘exchange 666’ అనే బెట్టింగ్ యాప్‌తో బెట్టింగ్ చేస్తున్న అచ్యుతాపురానికి చెందిన మాసారపు దక్షిణామూర్తి, చుక్క రఘు రామ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిన్న ఇదే బెట్టింగ్ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
News October 23, 2025
MHBD: 1800 దరఖాస్తులు.. రూ.54 కోట్లు ఆదాయం

జిల్లాలో 61 మద్యం షాపులకు 1800 దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్ ఎస్పీ కిరణ్ తెలిపారు. MHBD 667, తొర్రూర్ 769, గూడూరు 364 స్టేషన్ల వారీగా 1800 దరఖాస్తులు వచ్చాయి. 2023 సంవత్సరంలో మొత్తం 2,589 దరఖాస్తులకు 51.78 కోట్లు, 2025లో మొత్తం 1800 దరఖాస్తులకు రూ.3 లక్షల చొప్పున రూ.54 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. జిల్లా కేంద్రంలో ఈ 27 తేదీన లక్కీ డ్రా ఉంటుందన్నారు.
News October 23, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ హెడ్ లైన్స్

◈తాడేపల్లి ప్యాలెస్ నుంచి కల్తీ మద్యం సరఫరా: ఎమ్మెల్యే మామిడి
◈ టెక్కలి: నందెన్న ఊరేగింపులో ఘర్షణ..ఇద్దరిపై కేసు నమోదు
◈ మందస: చాపరాయి భూ సమస్యపై న్యాయం చేయాలి
◈అధ్వానంగా సరుబుజ్జిలి, కొత్తూరు ప్రధాన రహదారులు
◈ శ్రీకాకుళం: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన
◈ సింధూర జలసిరిపై పలాస ఎమ్మెల్యే శిరీష సమీక్ష
◈ఎల్.ఎన్ పేట: శవ దహనానికి సవాలక్ష పాట్లు
◈ అధికారులు అప్రమత్తంగా ఉండాలి: అచ్చెన్న