News February 8, 2025
‘ఢిల్లీ కింగ్‌మేకర్: నిర్మలా సీతారామన్’

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయానికి FM నిర్మలా సీతారామనే ప్రధాన కారణమని విశ్లేషకులు అంటున్నారు. ఈ నగరంలో ఎక్కువగా ఉద్యోగులే ఉంటారు. వారి చిరకాల కోరికైన Income Tax తగ్గింపును నిర్మలమ్మే తీర్చారని పేర్కొంటున్నారు. 50:50 ఉన్న విజయ సమీకరణాన్ని ఆమె BJP వైపు మార్చేశారని విశ్లేషిస్తున్నారు. బ్యాలెట్ ఓట్లలో 50% కన్నా ఎక్కువ వారికే పడటం దీనిని ప్రతిబింబిస్తోందని అంటున్నారు. దీనిపై మీ కామెంట్.
Similar News
News March 16, 2026
ఆస్కార్ అవార్డులు.. బెస్ట్ సినిమా ఇదే

‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రం ఆస్కార్ అవార్డు దక్కించుకుంది. లాస్ ఏంజెలిస్‌లో జరుగుతున్న అకాడమీ వేడుకలో విజేతగా నిలిచింది. ‘టైటానిక్’ హీరో డికాప్రియో ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ సినిమాలో నటనకు షాన్ పెన్ ఉత్తమ సహాయ నటుడిగా, కాస్టింగ్ విభాగంలో కస్సాండ్రా అవార్డు దక్కించుకున్నారు. ఇక ఉత్తమ నటుడిగా మైకేల్ బి జోర్డాన్(సిన్నర్స్), ఉత్తమ నటిగా జెస్సీ బక్లీ(హామ్నెట్) నిలిచారు.
News March 16, 2026
‘హార్ముజ్’ ఓపెన్‌కు సహకరించండి.. చైనా, నాటోకు ట్రంప్ హెచ్చరిక

ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు 50% పెరిగాయి. ఈ నేపథ్యంలో దీనిని తెరిపించేందుకు చైనా, నాటో దేశాలు సహకరించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి తెచ్చారు. సహకరించని పక్షంలో నాటో భవిష్యత్తుకు ముప్పని, చైనా అధ్యక్షుడితో జరగబోయే సదస్సును వాయిదా వేస్తానని ఆయన హెచ్చరించారు. జలసంధి ద్వారా లబ్ధి పొందే దేశాలే దాని భద్రతకు బాధ్యత వహించాలని ట్రంప్ స్పష్టం చేశారు.
News March 16, 2026
G20 దేశాల్లో పెట్రోల్ రేట్ల పెరుగుదల ఇలా: TBJP

యుద్ధం కారణంగా పెట్రో మంటతో అగ్రరాజ్యాలు అల్లాడుతున్నా మన దేశంలో ధరల నియంత్రణ పక్కాగా ఉందని TBJP పేర్కొంది. సామాన్యుడిపై భారం పడకుండా దేశాన్ని సురక్షితంగా నడిపిస్తున్న PM మోదీ సమర్థ నాయకత్వానికి ఈ గణాంకాలే నిదర్శనమంటూ G20 దేశాల్లో పెట్రోల్ రేట్ల జాబితాను Xలో పోస్ట్ చేసింది. FEB 1-MAR 12 మధ్య రేట్ల మార్పును ఇందులో పొందుపర్చింది. USలో అత్యధికంగా 22% పెరగగా INDలో మార్పు లేదని వెల్లడించింది.


