News February 8, 2025
సిద్దిపేట: దరఖాస్తుల పేరిట ప్రభుత్వం దగా: హరీశ్ రావు

దరఖాస్తుల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ కాలం వెల్లదీస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ‘X’లో మండిపడ్డారు. ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులకు విలువ లేదా అని ఎద్దేవా చేశారు. ప్రజలను ఎన్నిసార్లు మోసం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా ప్రశ్నించారు.14 నెలల కాంగ్రెస్ పాలనలో గందరగోళం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసి తీరాలన్నారు.
Similar News
News December 27, 2025
జనవరి 15 నుంచి అన్ని సేవలు ఆన్‌లైన్లోనే: విశాఖ కలెక్టర్

విశాఖ జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై ప్రతి ఫైల్‌ను ఈ-ఆఫీస్ విధానంలోనే నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. ఫిజికల్ ఫైళ్లకు స్వస్తి పలికి, జనవరి 15 నుంచి ప్రభుత్వ సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అందించాలని స్పష్టం చేశారు. ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ (95523 00009)పై ప్రజల్లో అవగాహన కల్పించాలని, సిబ్బంది తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వేయాలని అధికారులకు సూచించారు.
News December 27, 2025
కేజీబీవీ విద్యార్థినులకు కాస్మెటిక్ ఛార్జీల విడుదల

శ్రీ సత్యసాయి జిల్లాలోని కేజీబీవీ విద్యార్థినుల తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం కాస్మెటిక్ ఛార్జీలను జమ చేసినట్లు ఏజీసీడీఓ అనిత తెలిపారు. జిల్లాలోని 30 విద్యాలయాల్లో చదువుతున్న 7,735 మంది విద్యార్థినులకు గానూ రూ.77.35 లక్షలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. అలాగే 10, 11, 12 తరగతుల విద్యార్థినుల పరీక్షల రవాణా ఖర్చుల నిమిత్తం మరో రూ.10.24 లక్షలు జమ అయినట్లు ఆమె వెల్లడించారు.
News December 27, 2025
ఈ జాగ్రత్తలు కూడా తీసుకుంటే మంచిది

శీతాకాలంలో పాడి పశువుల పాలు పితికే సమయాన్ని కూడా మార్చుకుంటే మంచిది. చలికాలంలో పగటి సమయం తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. అందుకే పాలను ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య, సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య పితకడం మంచిదని పశు సంరక్షణా అధికారులు సూచిస్తున్నారు. అలాగే చలిగా ఉండే ఉదయం మరియు రాత్రివేళల్లో పశువులకు ఎండుగడ్డి, పొడి దాణా అందించాలి. పచ్చిగడ్డిని ఉదయం 11 గంటల ప్రాంతంలో అందిస్తే మంచిది.


