News February 8, 2025

VKB: ‘స్థానిక’ ఎన్నికలు.. కాంగ్రెస్, BRS, BJP మంతనాలు

image

ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. దీంతో వికారాబాద్ జిల్లాలోని గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష BRS, BJPకి చెందిన ఆశావహులు మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్యులను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది.

Similar News

News January 16, 2026

14 వేల పోలీసు ఉద్యోగాలు.. BIG UPDATE

image

TG: రాష్ట్రంలో 2024 నుంచి ఈ ఏడాది జనవరి వరకు 17 వేల మంది కానిస్టేబుల్, ఇతర సిబ్బంది రిటైర్ అయ్యారని అధికారులు నివేదిక ఇచ్చారు. వీరిలో దాదాపు 1100 మంది ఎస్సై, సీఐ, ఇతర సిబ్బంది ఉన్నారు. మొత్తంగా గ్రేటర్ పరిధిలోనే 6 వేల పోస్టులు ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ హామీ మేరకు 14 వేల పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం, ఆర్థికశాఖకు హోంశాఖ ఫైల్ పంపింది. ఆమోదం రాగానే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశముంది.

News January 16, 2026

దుర్గమ్మవారి పూజకు పోరంకి గోశాల పాలు

image

ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహించే శ్రీ చక్ర నవార్చణ పూజలో ఆలయ అధికారులు కీలక మార్పు చేశారు. పూజా కార్యక్రమాల్లో స్వచ్ఛతకు పెద్దపీట వేస్తూ, ఇకపై పోరంకిలోని దేవస్థానం గోశాల నుంచి సేకరించిన తాజా ఆవు పాలు మాత్రమే వినియోగించాలని నిర్ణయించారు. శాస్త్రీయ పద్ధతిలో, నాణ్యమైన పాలు పూజలకు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

News January 16, 2026

242 బెట్టింగ్ సైట్లు బ్లాక్

image

ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్లకు కేంద్రం షాక్ ఇచ్చింది. చట్టవిరుద్ధమైన 242 సైట్ల లింక్‌లను బ్లాక్ చేసింది. ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంది. ఇప్పటివరకు ప్రభుత్వం 7,800 ఇల్లీగల్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సైట్లను నిషేధించింది. వీటి వల్ల సమాజానికి నష్టం జరుగుతోందని, యువత భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం తెలిపింది.