News February 8, 2025
KK సర్వేకు బిగ్ షాక్

AP ఎన్నికలపై ఎగ్జాక్ట్ ఫిగర్‌కు దగ్గరగా ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించిన KK సర్వే ఇటీవల తేలిపోతోంది. ఢిల్లీలో AAPకు అధికారం వస్తుందని, ఆ పార్టీ 44 సీట్లు గెలుస్తుందని ఇటీవల ఈ సర్వే అంచనా వేసింది. కానీ ఫలితాల్లో AAP 22, BJP 48 చోట్ల లీడ్‌లో ఉన్నాయి. అటు 2024 హరియాణా ఎన్నికలపై ఈ సర్వే(INC-75, BJP-11) అంచనా ప్రకటించగా, అసలు ఫలితాల్లో BJP(48) గెలిచింది. దీంతో ఎగ్జిట్‌పోల్స్ క్రెడిబిలిటీ చర్చగా మారింది.
Similar News
News March 8, 2026
ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేకం.. నేడు CBN హాజరు

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై 12 ఏళ్లకోసారి జరిగే మహా కుంభాభిషేక వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం మొదలైన ఈ మూడు రోజుల క్రతువు ఇవాళ్టితో ముగియనుంది. నేడు ప్రధాన ఘట్టం జరగనుంది. ఆలయ విమాన గోపురంపై ఉన్న బంగారు కలశానికి పండితులు మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.
News March 8, 2026
T20 WC ఫైనల్.. పిచ్ రిపోర్ట్ ఇదే

INDvsNZ <<19325584>>ఫైనల్<<>> కోసం అహ్మదాబాద్ స్టేడియంలో మిక్స్‌డ్ సాయిల్ పిచ్ (70% రెడ్, 30% బ్లాక్) రెడీ చేశారు. బౌలర్లకు బౌన్స్ లభిస్తుంది. పేసర్లకు సహకరిస్తుంది. బ్యాటర్లకూ అడ్వాంటేజ్ ఉంటుందని, భారీ స్కోర్ నమోదవ్వొచ్చని అంచనా. Dew వచ్చే అవకాశముంది. దీంతో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే ఛాన్సుంది. ఈ పిచ్‌ను SAvsCAN (feb 9) మ్యాచుకు వాడారు. SA 213/4 స్కోర్(1st బ్యాటింగ్) చేసి, 57 రన్స్ తేడాతో గెలిచింది.
News March 8, 2026
6 నెలల పాటు యుద్ధానికి సిద్ధం: IRGC

ఇరాన్-ఇజ్రాయెల్, US యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. 6 నెలల పాటు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) స్టేట్ మీడియాకు వెల్లడించింది. ఇక అమెరికాతో యుద్ధంపై చర్చలకు వెళ్లబోమని ఇరాన్ ప్రకటించడంపై ట్రంప్ స్పందించారు. ఆ దేశంపై దాడులు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అటు శనివారం 300 లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.


