News March 19, 2024
BREAKING: ఎమ్మెల్సీ కవిత కేసులో బిగ్ ట్విస్ట్
ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె కేసు విచారణ జరుపుతున్న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి జస్టిస్ నాగ్‌పాల్ అనూహ్యంగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జస్టిస్ కావేరి భావేజా నియమితులయ్యారు. ఇటీవల కవితకు నాగ్‌పాల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే.
Similar News
News November 6, 2024
స్వింగ్ స్టేట్‌కు నకిలీ బాంబు బెదిరింపులు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. కీలకమైన ఏడు స్వింగ్ స్టేట్స్‌లో ఒకటైన జార్జియాలోని ఫుల్టన్ కౌంటీలో ఐదు పోలింగ్ స్టేషన్లకు బెదిరింపులు వచ్చాయి. అయితే, వీటిని నకిలీవిగా తేల్చినట్టు కౌంటీ ఎన్నికల అధికారి నడైన్ విలియమ్స్ తెలిపారు. 5 స్టేషన్లలో రెండింటిని అరగంటపాటు ఖాళీ చేయించినట్టు ఆయన వెల్లడించారు. అనంతరం తిరిగి పోలింగ్ ప్రారంభించామని తెలిపారు.
News November 5, 2024
బరాక్ ఒబామాకు సిద్ద రామయ్య ఆహ్వానం
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు CM సిద్ద రామయ్య ప్రత్యేక ఆహ్వానాన్ని పంపారు. 1924లో బెలగావిలో జరిగిన 39వ భారత జాతీయ కాంగ్రెస్ సదస్సు అధ్యక్షుడిగా మహాత్మా గాంధీ బాధ్యతలు చేపట్టి వందేళ్లు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం వచ్చే నెల బెలగావిలో శతాబ్ది ఉత్సవాలతోపాటు శాసనసభ సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఒబామాను సిద్ద రామయ్య కోరారు.
News November 5, 2024
పెళ్లి కుదర్చలేదని మ్యాట్రిమోనీ సైట్‌కు రూ.60వేలు ఫైన్!
బెంగళూరులో దిల్మిల్ మ్యాట్రిమోనీ సైట్ ఓ వ్యక్తికి పెళ్లి కుదర్చలేకపోయినందుకు కన్జూమర్ కోర్టు ₹60వేల ఫైన్ విధించింది. ఆ మొత్తాన్ని సదరు కస్టమర్‌కు చెల్లించాలని ఆదేశించింది. తన కొడుక్కి 45రోజుల్లో మ్యాచ్ కుదుర్చుతామని హామీ ఇవ్వడంతో ఓ కస్టమర్ ₹30వేలు చెల్లించాడు. రోజులు గడుస్తున్నా ఒక్క మ్యాచ్ కూడా కుదర్చలేదు. దీంతో తన అమౌంట్ రీఫండ్ చేయాలని అతడు కమిషన్‌ను ఆశ్రయించాడు. ఫలితంగా ఈ తీర్పు వచ్చింది.