News February 8, 2025
కేరళ క్రికెట్ సంఘంపై శ్రీశాంత్ ఆగ్రహం

కేరళ క్రికెట్ అసోసియేషన్(KCA)కు, మాజీ బౌలర్ శ్రీశాంత్‌కు మధ్య వివాదం ముదురుతోంది. విజయ్ హజారే ట్రోఫీకి KCA సంజూని సెలక్ట్ చేయకపోవడం వల్లే అతడికి ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాన్స్ దక్కలేదని శ్రీశాంత్ ఇటీవల ఆరోపించారు. ఆ ఆరోపణల్ని తిప్పికొట్టిన కేసీఏ, ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా అండగా నిలిచామని గుర్తుచేసింది. దానిపై స్పందించిన శ్రీశాంత్, తన పరువు తీసిన వారు తగిన జవాబు చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Similar News
News March 26, 2026
పొట్టేళ్లకు ఎండు మేత చాలా ముఖ్యం

పొట్టేళ్ల పెంపకంలో పచ్చి మేత కంటే ఎండు మేతే చాలా ముఖ్యమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. వేరుశనగ పొట్టు, ఉలవ పొట్టు, కంది పొట్టు వంటి చాలా రకాల ఎండు మేతలు అందుబాటులో ఉన్నాయి. వీటిని పొట్టేళ్లు చాలా ఇష్టంగా తింటాయి. దీని వల్ల అవి చాలా ఆరోగ్యంగా ఉంటూ, ఎక్కువ బరువు పెరుగుతాయి. అందుకే పచ్చిమేత కాస్త తక్కువైనా, ఎండు మేతను వెటర్నరీ నిపుణుల సూచనలతో సరైన పరిమాణంలో అందేలా చూసుకోవాలి.
News March 26, 2026
రోజూ కాసేపు హాయిగా నవ్వితే..

నవ్వు బెస్ట్ మెడిసిన్ అంటున్నారు వైద్యులు. రోజూ కాసేపు మనస్ఫూర్తిగా నవ్వితే ఫిజికల్, మెంటల్ టెన్షన్లు, ఒత్తిడి, కోపం తగ్గుతాయంటున్నారు. ‘10-15ని.లు నవ్వితే 40 క్యాలరీలు ఖర్చవుతాయి. ఫీల్ గుడ్ హార్మోన్లయిన ఎండార్ఫిన్‌లు విడుదలవుతాయి. రోగనిరోధక శక్తి, రక్త నాళాల పనితీరు మెరుగుపడుతుంది. గుండె సమస్యలు, BP తగ్గుతాయి. క్యాన్సర్‌పై పోరాటంలోనూ సాయపడుతుంది’ అని పేర్కొంటున్నారు.
#ShareIt
News March 26, 2026
BREAKING: పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.220 పెరిగి రూ.1,46,890కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.200 పెరిగి రూ.1,34,650 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2.60 లక్షలుగా ఉంది.


