News February 8, 2025

AAPకి అధికారం ఎందుకు దూరమైందంటే?

image

2015, 2020 ఎన్నికల్లో 70 స్థానాలకు 67, 62 స్థానాల్లో అద్భుత విజయం సాధించి అధికారంలోకి వచ్చిన AAPను ఈసారి పలు వివాదాలు చుట్టుముట్టాయి. హామీలు అమలు చేయకపోవడం, ఎయిర్ క్వాలిటీపై ప్రజల అసంతృప్తి, CM అధికార నివాసం శేష్ మహల్‌ను రూ.33.66 కోట్లతో అభివృద్ధి చేసుకోవడంపై ఆరోపణలు, AK అవినీతిపై BJP ప్రచారం, లిక్కర్ స్కాంలో AK, మంత్రులు, AAP నేతలు జైలుకెళ్లడంతో పాలన గాడితప్పి ఆ పార్టీని అధికారానికి దూరం చేశాయి.

Similar News

News March 20, 2026

జొమాటో కస్టమర్లకు షాక్.. ప్లాట్‌ఫామ్ ఫీజు పెంపు

image

ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కస్టమర్లకు షాకిచ్చింది. ప్లాట్‌ఫామ్ ఫీజును ఆర్డర్‌పై రూ.2.40 చొప్పున పెంచింది. దీంతో రూ.12.50 నుంచి రూ.14.90కి పెరిగింది. పోటీ కంపెనీ స్విగ్గీ ఇప్పటికే ఆర్డర్‌పై రూ.14.99 చొప్పున వసూలు చేస్తోంది. ఇంధన ధరలు పెరిగిన కారణంగానే ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచినట్లు తెలుస్తోంది. దీనివల్ల డెలివరీ పార్ట్‌నర్లతోపాటు రెస్టారెంట్లపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.

News March 20, 2026

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు.. రిజిస్ట్రేషన్లు షురూ

image

2026-27 విద్యాసంవత్సరానికి గాను కేంద్రీయ విద్యాలయాల్లో(KV) అడ్మిషన్లకు నేటి నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలైంది. ఒకటో తరగతితోపాటు బాల్ వాటికల్లో ప్రవేశాలకు <>https://kvsangathan.nic.in<<>>/లోకి వెళ్లి ఏప్రిల్ 2 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బాల్ వాటికలకు ఏప్రిల్ 8న, ఒకటో తరగతికి 9న తొలి జాబితాను విడుదల చేస్తారు. సీట్ల ఖాళీలను బట్టి 16న రెండో, 21న మూడో లిస్టును ప్రకటిస్తారు.
Share It

News March 20, 2026

2014 నుంచి 6వేల ఫోన్లు ట్యాప్: రేవంత్

image

TG: BRS ప్రభుత్వ హయాంలో 6వేల ఫోన్లను ట్యాప్ చేయించారని CM రేవంత్ వెల్లడించారు. ‘ట్యాపింగ్ కేసులో చట్టప్రకారం ముందుకెళ్తున్నాం. విచారణ పూర్తికాకుండా అరెస్టులు చేయలేం. పంజాగుట్ట PSలోని కేసులో హరీశ్‌కు ఊరట వస్తే మొత్తానికి క్లీన్‌చిట్ వచ్చినట్లు BRS ప్రచారం చేస్తోంది. 2014 నుంచి ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇప్పటికే IAS అరవింద్ కుమార్‌ను సస్పెండ్ చేశాం’ అని రేవంత్ మీడియాతో చిట్‌చాట్‌లో తెలిపారు.