News February 8, 2025
బెల్లంపల్లిలో బీర్ సీసాలతో దాడి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739002611258_51297756-normal-WIFI.webp)
బెల్లంపల్లిలోని ఓ బార్‌లో బీర్ సీసాలతో దాడి చేసుకోవడం భయాందోళన సృష్టించింది. 2 టౌన్ SI మహేందర్ వివరాల ప్రకారం.. స్థానిక గొల్లగూడెంకు చెందిన సాగర్ స్నేహితులతో కలిసి కాల్ టెక్స్‌లోని బార్‌లో మద్యం తాగుతున్నారు. అదే బార్‌లో మద్యం తాగుతున్న తాండూర్‌కు చెందిన వంశీ మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. సాగర్, అతని స్నేహితులు బీర్ సీసా పగలగొట్టి వంశీపై దాడి చేశారు. గొడవపై కేస్ నమోదైంది.
Similar News
News February 8, 2025
మేడ్చల్: వెంచర్‌లో యువకుడి హత్య!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739023174598_60457847-normal-WIFI.webp)
యువకుడు అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. మేడ్చల్ పీఎస్ పరిధిలోని జమున వెంచర్లో సిమెంట్ ఇటుకలు తయారుచేసే కార్మికుడు కన్నా(40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మద్యం మత్తులో గొడవపడి మరో కార్మికుడు హత్య ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News February 8, 2025
మెటాలో 3,000 మందికి లేఆఫ్స్?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739022935794_1032-normal-WIFI.webp)
టెక్ దిగ్గజం మెటా భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 10 నుంచి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు సమాచారం. సుమారు 12 దేశాల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. జాబ్ కోల్పోయినవారికి సెవెరెన్స్ ప్యాకేజీ ఇస్తారని టాక్. పనితీరు సరిగ్గా లేని ఉద్యోగులను మాత్రమే తొలగించనున్నట్లు మెటా గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.
News February 8, 2025
ఢిల్లీలో AAPకు కాంగ్రెస్ దెబ్బ: రాజ్‌దీప్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739022753448_367-normal-WIFI.webp)
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ AAPకు చాలా డ్యామేజ్ చేసిందని ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ అభిప్రాయపడ్డారు. 13 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు సాధించిన ఓట్లు బీజేపీ-ఆప్ ఓట్ల మధ్య వ్యత్యాసం కంటే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తే చాలా సీట్లలో నెక్ టు నెక్ ఫైట్ ఉండేదన్నారు. 2022లో గోవాలో కాంగ్రెస్ ఇలాగే AAPకు డ్యామేజ్ చేసిందని గుర్తు చేశారు.