News February 8, 2025

అన్నమయ్య: తండ్రి, కూతురు మృతి UPDATE

image

అన్నమయ్య జిల్లా ములకలచెరువులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాద మృతుల వివరాలు లభించినట్లు ఎస్సై నరసింహుడు తెలిపారు. మృతులు మదనపల్లి ప్రశాంత్ నగర్‌కు చెందిన భవన కార్మికుడు సోమశేఖర్(35), కుమార్తె సిద్దేశ్వరి(03)గా గుర్తించామన్నారు. కదిరిలో పెదనాన్న అంత్యక్రియలకు బైకులో వెళుతుండగా.. ములకలచెరువు వద్ద ఐచర్ వాహనం ఢీకొట్టి తండ్రి, కుమార్తె చనిపోగా.. భార్య కవిత (25), కొడుకు రెడ్డి శేఖర్(05)ని రుయాకు తరలించారు.

Similar News

News February 8, 2025

టాప్‌లో సింగపూర్ పాస్‌పోర్ట్.. భారత్ ప్లేస్ ఎంతంటే?

image

ప్రపంచంలోనే సింగపూరియన్ పాస్‌పోర్ట్ మోస్ట్ పవర్‌ఫుల్‌గా నిలిచింది. దీని ద్వారా ప్రపంచంలోని 193 దేశాలకు వీసా లేకుండా/వీసా ఆన్ అరైవల్ వెళ్లవచ్చు. హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ రూపొందించిన ఈ జాబితాలో భారత్ 80వ స్థానంలో నిలిచింది. మన పాస్‌పోర్టుతో 56 దేశాలకు వెళ్లవచ్చు. సింగపూర్ తర్వాతి స్థానాల్లో సౌత్ కొరియా, జపాన్, స్పెయిన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, ఐర్లాండ్, ఫిన్‌లాండ్, డెన్మార్క్ దేశాలు ఉన్నాయి.

News February 8, 2025

ఢిల్లీలో కాంగ్రెస్ ‘జీరో హ్యాట్రిక్’ రికార్డ్ ఇందుకేనేమో?

image

ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్నఢిల్లీ, ప్రస్తుతం సున్నాలతో హ్యాట్రిక్ కొట్టింది. 2013లో హస్తం పార్టీ తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో ప్రజలు ఆప్ వైపు మెుగ్గుచూపారు. షీలాదీక్షిత్ తర్వాత మోదీ, కేజ్రీవాల్‌ను ఎదుర్కొనే నాయకుడు దొరకలేదు. కిందిస్థాయి సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో పార్టీ విఫలమైంది. వీటితో పాటు ఇండియా కూటమి విభేదాలు పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టినట్లు భావిస్తున్నారు.

News February 8, 2025

రేపు ఏలూరు అంబికా థియేటర్‌కు తండేల్ చిత్ర యూనిట్ 

image

హీరో నాగ చైతన్య నటించిన తండేల్ చిత్రం విజయ యాత్రలో భాగంగా ఆదివారం ఏలూరు అంబికా థియోటర్‌కు చిత్ర యూనిట్ రానున్నట్లు థియేటర్ యాజమాన్యం తెలిపింది. మధ్యాహ్నం రెండు గంటలకు థియేటర్‌కు హీరో నాగచైతన్య‌తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు హాజరవుతారని తెలిపారు. 

error: Content is protected !!