News February 8, 2025

NGKL: చెట్టు పైనుంచి జారిపడి గీతా కార్మికుడు మృతి

image

నాగర్ కర్నూల్ మండలంలోని నాగనూల్ గ్రామంలో చెట్టుపై నుంచి పడి గీతాచార్యుడు మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్(58) రోజు మాదిరిగానే ఈత చెట్టు ఎక్కి గీస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లే లోపు మార్గమధ్యలో మృతి చెందాడు.

Similar News

News February 8, 2025

ఢిల్లీలో AAPకు కాంగ్రెస్ దెబ్బ: రాజ్‌దీప్

image

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ AAPకు చాలా డ్యామేజ్ చేసిందని ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ అభిప్రాయపడ్డారు. 13 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు సాధించిన ఓట్లు బీజేపీ-ఆప్ ఓట్ల మధ్య వ్యత్యాసం కంటే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తే చాలా సీట్లలో నెక్ టు నెక్ ఫైట్ ఉండేదన్నారు. 2022లో గోవాలో కాంగ్రెస్ ఇలాగే AAPకు డ్యామేజ్ చేసిందని గుర్తు చేశారు.

News February 8, 2025

వయోవృద్ధులకు ప్రాధాన్యత ఇవ్వాలి: డీఆర్‌వో గణేశ్

image

వయో వృద్ధులకు తప్పనిసరిగా తగిన ప్రాధాన్యతను ఇవ్వాలని హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి విగణేశ్ అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాస్థాయి వయోవృద్ధుల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి గణేశ్ మాట్లాడుతూ.. వయోవృద్ధులను గౌరవించడం, వారి సంక్షేమం కోసం జిల్లా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.

News February 8, 2025

రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల రూపాయల రుణమాఫీ చేసింది: మంత్రి సీతక్క

image

ములుగు మండలం ఇంచర్లలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ అధ్యక్షతన ములుగు, వెంకటాపూర్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి సీతక్క హాజరై మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. రైతులను ఆదుకోవాలన్న లక్ష్యంతో రూ.2లక్షల రుణమాఫీ చేసిందని మంత్రి సీతక్క అన్నారు.

error: Content is protected !!