News February 8, 2025

ఆహార శుద్ధి పరిశ్రమకు అగ్రిమెంట్

image

భూపాలపల్లి, ములుగు జిల్లాలోని రైతు సోదరులతో అగ్రిమెంట్ చేయించుకుని ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు భూపాలపల్లి జిల్లా వ్యవసాయ సంక్షేమ సంఘం తరఫున ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సొసైటీ అధ్యక్షులు సిరికొండ తిరుపతిరావు తెలిపారు. ఈ జిల్లాలో పండుతున్న పంటలు, రైతుల అభిప్రాయాలను తెలుసుకునే విధంగా శనివారం నాబార్డ్ జీఎం తో సమావేశమయ్యారు. నాబార్డ్ అధికారులు సొసైటీ డైరెక్టర్లు రవీందర్ రెడ్డి, కిరణ్ ఉన్నారు.

Similar News

News March 10, 2026

నెల్లూరు జిల్లాలో ‘ఆపరేషన్ చిన్నారి తల్లి’ ముమ్మరం

image

పిల్లల రక్షణే ధ్యేయంగా నెల్లూరు ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆదేశాలతో ‘ఆపరేషన్ చిన్నారి తల్లి’ కార్యక్రమం జిల్లావ్యాప్తంగా సాగుతోంది. శక్తి బృందాలు పాఠశాలల్లో ఫొక్సో (POCSO) చట్టం, బాల్య వివాహాల నిర్మూలన, డ్రగ్స్ నిరోధంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాయి. అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటూ, ఆపదలో 100, 112, 1098 నంబర్లను సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు.

News March 10, 2026

పోలీస్‌ అధికారి అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ..!

image

వ్యాపారం ముసుగులో ఓ <<19334509>>పోలీస్ <<>>అధికారి కుటుంబం చేసిన మోసాలపై విజిలెన్స్ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న సదరు అధికారి కుటుంబంతో బాధితుడు జరిపిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. అమ్మపాలెంలోని సర్వే నంబర్ 593/2లో ఉన్న వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ వ్యవహారంపై అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలిసింది. ఉన్నతాధికారులు రంగంలోకి దిగడం పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది.

News March 10, 2026

సిరిసిల్ల: నేటి నుంచి టీకాలు ప్రారంభం

image

సిరిసిల్ల జిల్లాలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ నేటి నుంచి ప్రారంభం కానుంది. జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 13 మండలాల్లో ఈ టీకాలను ఉచితంగా వేయనున్నట్లు జిల్లా పశువైద్యాధికారి వి.రవీందర్ రెడ్డి తెలిపారు. చందుర్తి (M) మర్రిగడ్డలో జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.