News February 8, 2025
భద్రాద్రి: విద్యుత్ షాక్‌తో మహిళ మృతి
ములకలపల్లి మండలం సుబ్బనపల్లి, బండివారి గుంపులో కరెంట్ షాక్‌తో బండి వెంకటమ్మ(57) మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వారి వివరాలిలా.. వెంకటమ్మ తన నివాసంలో ఉండగా, మంచం మీద కరెంట్ వైర్ పడటంతో ఈ విషాదం జరిగి ఉంటుందని చెబుతున్నారు. ఇంటి నుంచి కాలిన వాసన రావడంతో సమీప ప్రజలు వెళ్లి చూడగా, అప్పటికే మృతి చెందారని తెలిపారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 8, 2025
‘తండేల్’ సినిమా OTT విడుదల ఎప్పుడంటే?
చందూ మొండేటి తెరకెక్కించిన ‘తండేల్’ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని రూ.90 కోట్లతో రూపొందించడంతో ఓటీటీ హక్కుల కోసం భారీగానే చెల్లించినట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. థియేటర్ రెస్పాన్స్ బాగుండటంతో ఈ చిత్రం 8 వారాల తర్వాతే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. ‘తండేల్’లో నాగచైతన్య, సాయి పల్లవి మధ్య సాగే లవ్ స్టోరీ ఆకట్టుకుంటోంది.
News February 8, 2025
టాప్‌లో సింగపూర్ పాస్‌పోర్ట్.. భారత్ ప్లేస్ ఎంతంటే?
ప్రపంచంలోనే సింగపూరియన్ పాస్‌పోర్ట్ మోస్ట్ పవర్‌ఫుల్‌గా నిలిచింది. దీని ద్వారా ప్రపంచంలోని 193 దేశాలకు వీసా లేకుండా/వీసా ఆన్ అరైవల్ వెళ్లవచ్చు. హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ రూపొందించిన ఈ జాబితాలో భారత్ 80వ స్థానంలో నిలిచింది. మన పాస్‌పోర్టుతో 56 దేశాలకు వెళ్లవచ్చు. సింగపూర్ తర్వాతి స్థానాల్లో సౌత్ కొరియా, జపాన్, స్పెయిన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, ఐర్లాండ్, ఫిన్‌లాండ్, డెన్మార్క్ దేశాలు ఉన్నాయి.
News February 8, 2025
ఢిల్లీలో కాంగ్రెస్ ‘జీరో హ్యాట్రిక్’ రికార్డ్ ఇందుకేనేమో?
ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్నఢిల్లీ, ప్రస్తుతం సున్నాలతో హ్యాట్రిక్ కొట్టింది. 2013లో హస్తం పార్టీ తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో ప్రజలు ఆప్ వైపు మెుగ్గుచూపారు. షీలాదీక్షిత్ తర్వాత మోదీ, కేజ్రీవాల్‌ను ఎదుర్కొనే నాయకుడు దొరకలేదు. కిందిస్థాయి సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో పార్టీ విఫలమైంది. వీటితో పాటు ఇండియా కూటమి విభేదాలు పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టినట్లు భావిస్తున్నారు.