News February 8, 2025
మేడారానికి బస్సు ప్రారంభం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739006413690_20316190-normal-WIFI.webp)
మినీ మేడారం జాతర సందర్భంగా భక్తులకు బస్సు సర్వీస్ ప్రారంభమైంది. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే మినీ మేడారం జాతరకు హనుమకొండ నుంచి తాడ్వాయి మీదుగా ప్రతి రోజు 6 ట్రిప్పులు బస్సులు నడపనున్నట్లు ఆర్ఎం తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం ఉందని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మంత్రి సీతక్క చొరవతో మహా జాతరకు బస్సు సౌకర్యం ఉన్నట్లు మినీ జాతరకు కూడా బస్సులు ఏర్పాట్లు చేశారు.
Similar News
News February 8, 2025
పెంబి: పురుగుమందు తాగి వివాహిత మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739022931531_51420205-normal-WIFI.webp)
పురుగు మందు తాగి వివాహిత మృతి చెందిన ఘటన పెంబి మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై హనుమండ్లు తెలిపిన వివరాల ప్రకారం.. పోచంపల్లికి చెందిన మాలావత్ సానుక(22)ను ఆమె భర్త ఈనెల 3న మొక్కజొన్న పంటకు నీళ్లు పారీయమని చెప్పగా ఆమె క్షణికావేశానికి లోనై పురుగుల మందు తాగిందన్నారు. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శనివారం మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News February 8, 2025
లిక్కర్ స్కామ్‌లో భాగమైన మూడు పార్టీలు బలి!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739028081068_1032-normal-WIFI.webp)
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో సంబంధమున్న మూడు పార్టీలు తమ రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయాయి. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ, ఢిల్లీలో ఆప్‌లు ఓటమి చవిచూశాయి. లిక్కర్ స్కామ్‌లో ఆప్ నుంచి మనీశ్ సిసోడియా, కేజ్రీవాల్, బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, వైసీపీ నుంచి మాగుంట రాఘవరెడ్డికి ఈ కేసుతో సంబంధాలు ఉన్నాయి. ఇదే కేసులో వీరందరూ ఢిల్లీ తిహార్ జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలయ్యారు.
News February 8, 2025
PHOTO: అల్లు అర్జున్ సూపర్ లుక్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739027832905_1226-normal-WIFI.webp)
‘పుష్ప-2’ కోసం గడ్డం పెంచిన అల్లు అర్జున్ ఈ మధ్యనే లుక్ మార్చారు. పుష్ప-2 థాంక్యూ మీట్లో సందడి చేసిన ఆయన గడ్డం ట్రిమ్ చేసి మరింత స్టైలిష్‌గా కనిపించారు. పుష్ప-2 రిలీజ్ తర్వాత పలు ఘటనలతో ఆయన మీడియాకు దూరమయ్యారు. ఈ క్రమంలో తాజా లుక్ అదిరిపోయిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆయన తదుపరి చిత్రంపై ప్రకటన మార్చిలో వచ్చే అవకాశముంది.