News February 8, 2025
మేడారానికి బస్సు ప్రారంభం

మినీ మేడారం జాతర సందర్భంగా భక్తులకు బస్సు సర్వీస్ ప్రారంభమైంది. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే మినీ మేడారం జాతరకు హనుమకొండ నుంచి తాడ్వాయి మీదుగా ప్రతి రోజు 6 ట్రిప్పులు బస్సులు నడపనున్నట్లు ఆర్ఎం తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం ఉందని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మంత్రి సీతక్క చొరవతో మహా జాతరకు బస్సు సౌకర్యం ఉన్నట్లు మినీ జాతరకు కూడా బస్సులు ఏర్పాట్లు చేశారు.
Similar News
News March 16, 2026
విశాఖ: పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌లకు 397 వినతులు

పీజీఆర్ఎస్‌లో వచ్చిన అర్జీలకు గడువులోగా పరిష్కారం చూపకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ హెచ్చరించారు. సోమవారం ఉదయం కలెక్టర్ వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై సాధారణ పీజీఆర్ఎస్‌కు 397 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ క్లినిక్‌కు 119, జీవీఎంసీకి చెందినవి 94, పోలీసు 26, ఇతర శాఖలకు సంబంధించినవి 158 వినతులు ఉన్నాయి.
News March 16, 2026
అర్జీలు.. త్వరితగతిన పరిష్కరించండి: ఎస్పీ

పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎస్పీ కృష్ణారావు స్వయంగా బాధితుల నుంచి 88 అర్జీలను స్వీకరించారు. వీటిలో ప్రధానంగా ఆర్థిక లావాదేవీలు, కుటుంబ తగాదాలు, భూ వివాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఫిర్యాదును చట్టబద్ధంగా, నిర్ణీత గడువులోగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
News March 16, 2026
అమెరికాలో వరంగల్ యువ ఇంజినీర్ మృతి!

అమెరికాలో వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాకేష్(40) గుండెపోటుతో మృతిచెందారు. భారత కాలమానం ప్రకారం నిన్న సాయంత్రం ఘటన జరిగింది. ఉద్యోగరీత్యా అమెరికాకు వెళ్లిన రాకేశ్ కుటుంబంతో కలిసి విరిగినియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ స్థిరపడ్డారు. 2014లో కరీంనగర్‌కు చెందిన తేజస్వినితో వివాహం కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిన్న వయసులోనే ఆయన మృతి చెందడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.


