News February 8, 2025
మేడారానికి బస్సు ప్రారంభం

మినీ మేడారం జాతర సందర్భంగా భక్తులకు బస్సు సర్వీస్ ప్రారంభమైంది. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే మినీ మేడారం జాతరకు హనుమకొండ నుంచి తాడ్వాయి మీదుగా ప్రతి రోజు 6 ట్రిప్పులు బస్సులు నడపనున్నట్లు ఆర్ఎం తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం ఉందని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మంత్రి సీతక్క చొరవతో మహా జాతరకు బస్సు సౌకర్యం ఉన్నట్లు మినీ జాతరకు కూడా బస్సులు ఏర్పాట్లు చేశారు.
Similar News
News March 19, 2026
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చోటిస్తారా..!

త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, ఓ లంబాడా నేతకు బెర్తు దక్కే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. జిల్లా నుంచి ఆ సామాజిక వర్గం నుంచి బాలునాయక్ ఉన్నారు. ఇక మరో నేత రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం కళ్లలో వత్తులేసుకుని చూస్తున్నారు. త్వరలోనే మంత్రిని అవుతానంటూ ఆయన చౌటుప్పల్‌తో పాటు పలు చోట్ల కామెంట్స్ చేశారు. మరి అమాత్య యోగం ఎవరికి దక్కుతుందో అని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
News March 19, 2026
ఒంగోలు: విధుల్లో గుండెపోటుతో కుప్పకూలిన కానిస్టేబుల్

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పనిచేస్తున్న ఎక్సైజ్ కార్యాలయ కానిస్టేబుల్ కందుల రాఘవరావు విధుల్లో ఉండగా మృతి చెందారు. సెంట్రీ డ్యూటీలో ఉండగా ఆయనకు గుండెపోటు రావడంతో బుధవారం ఒక్కసారిగా కుప్పకూలారు. ఆయన స్వగ్రామం ప్రకాశం జిల్లా ఒంగోలు కాగా మృతదేహాన్ని అక్కడికి తరలించారు. ఐదు నెలల క్రితం ఈయన ఆత్మకూరుకు బదిలీపై వచ్చారు. ఆఫీసులోనే చనిపోవడంతో సహచర ఉద్యోగులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
News March 19, 2026
తొలి విడతలోనే అందరికీ రైతు భరోసా?

రైతు భరోసా పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. విస్తీర్ణం ప్రాతిపదికన విడతల వారీగా కాకుండా ఈ నెల 22న ఒకే రోజు 70 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించాలని చూస్తోంది. రైతుకు ఎంత భూమి ఉన్నా తొలి విడతలో మొదటి ఎకరాకు ₹6,000 నగదును అకౌంట్లలో జమ చేస్తారని సమాచారం. మిగిలిన భూమికి 2, 3 విడతల్లో సాయం అందనుంది. ఎకరం లోపు ఉన్న వారికి ఎలాగూ తొలిరోజే పడుతుంది.


