News February 8, 2025

ఇంగ్లండ్‌తో రెండో వన్డేకు జైస్వాల్ ఔట్?

image

ఇంగ్లండ్‌తో జరగబోయే రెండో వన్డేలో టీమ్‌ఇండియా క్రికెటర్ యశస్వీ జైస్వాల్‌ను తప్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతారని సమాచారం. కెప్టెన్ రోహిత్‌‌తో కలిసి వైస్‌కెప్టెన్ శుభ్‌మన్ ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తారని టాక్. రేపు కటక్‌లో ఇరుజట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. కాగా తొలివన్డేతోనే జైస్వాల్ అరంగేట్రం చేయగా మోకాలిగాయం కారణంగా కోహ్లీ ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు.

Similar News

News March 16, 2026

114 అర్జీలను స్వీకరించాం: అనంత ఎస్పీ

image

అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 114 పిటీషన్లు స్వీకరించినట్లు ఎస్పీ జగదీశ్ వెల్లడించారు. పిటీషనర్లతో ముఖాముఖి మాట్లాడి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పిటీషనర్లు, వీరి వెంట వచ్చిన కుటుంబ సభ్యులకు ఇస్కాన్ సహకారంతో ఉచిత భోజన సదుపాయం కల్పించామన్నారు.

News March 16, 2026

వరుస సెలవులు.. ప్రత్యేక బస్సులు

image

ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో పలు కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులు సొంతూళ్లకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. గురువారం ఉగాది, శనివారం రంజాన్ సెలవు దినాలు కావడంతో.. శుక్రవారం ఒక్కరోజు లీవ్ పెడితే ఆదివారంతో కలిపి వరుసగా 4 రోజులు సెలవులు రానున్నాయి. ఇక పండుగ రద్దీ దృష్ట్యా 17, 18వ తేదీల్లో TGSRTC ప్రత్యేక బస్సులు(స్పెషల్ ఛార్జీలు వర్తిస్తాయి) నడపనున్నట్లు ప్రకటించింది.

News March 16, 2026

‘పద్మ వ్యూహం’ నిర్మాణం ఎలా ఉంటుందంటే?

image

బయటపడలేని సమస్యల్లో ఉన్నప్పుడు ‘పద్మవ్యూహం’లో ఇరుక్కుపోయారని అంటారు. భారతంలో ద్రోణాచార్యుడు పన్నిన శత్రు దుర్భేద్యమైన యుద్ధ నిర్మాణమే పద్మవ్యూహం. తామరపువ్వు ఆకారంలో 7 వలయాల్లో రథ, గజ, అశ్వ, పదాతి సైన్యాలతో ఉంటుంది. ఇందులోకి వెళ్లిన అభిమన్యుడు తనువు చాలించారు. దీన్ని ఛేదించగలిగేది కృష్ణుడు, ప్రద్యుమ్నుడు, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ, అర్జునుడు మాత్రమే.
<<-se>>#EPICSAYINGS<<>>