News February 8, 2025
ప్రముఖ నటుడు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739008351629_81-normal-WIFI.webp)
ప్రముఖ హాలీవుడ్ నటుడు టోనీ రాబర్ట్స్(85) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఆయన మరణించినట్లు కుమార్తె వెల్లడించారు. ప్లే ఇట్ ఎగైన్, సామ్, రేడియో డేస్, స్టార్ డస్ట్ మెమోరీస్, హన్నా అండ్ హర్ సిస్టర్స్, ద గర్ల్స్ ఇన్ ద ఆఫీస్, కీ ఎక్స్ఛేంజ్, డర్టీ డాన్సింగ్, మై బెస్ట్ ఫ్రెండ్స్ వైఫ్ సహా ఎన్నో సినిమాల్లో నటించారు. ఆయన గాయకుడు కూడా.
Similar News
News February 8, 2025
లిక్కర్ స్కామ్‌లో భాగమైన మూడు పార్టీలు బలి!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739028081068_1032-normal-WIFI.webp)
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో సంబంధమున్న మూడు పార్టీలు తమ రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయాయి. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ, ఢిల్లీలో ఆప్‌లు ఓటమి చవిచూశాయి. లిక్కర్ స్కామ్‌లో ఆప్ నుంచి మనీశ్ సిసోడియా, కేజ్రీవాల్, బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, వైసీపీ నుంచి మాగుంట రాఘవరెడ్డికి ఈ కేసుతో సంబంధాలు ఉన్నాయి. ఇదే కేసులో వీరందరూ ఢిల్లీ తిహార్ జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలయ్యారు.
News February 8, 2025
PHOTO: అల్లు అర్జున్ సూపర్ లుక్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739027832905_1226-normal-WIFI.webp)
‘పుష్ప-2’ కోసం గడ్డం పెంచిన అల్లు అర్జున్ ఈ మధ్యనే లుక్ మార్చారు. పుష్ప-2 థాంక్యూ మీట్‌లో సందడి చేసిన ఆయన గడ్డం ట్రిమ్ చేసి మరింత స్టైలిష్‌గా కనిపించారు. పుష్ప-2 రిలీజ్ తర్వాత పలు ఘటనలతో ఆయన మీడియాకు దూరమయ్యారు. ఈ క్రమంలో తాజా లుక్ అదిరిపోయిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆయన తదుపరి చిత్రంపై ప్రకటన మార్చిలో వచ్చే అవకాశముంది.
News February 8, 2025
OFFICIAL: బీజేపీకి 48, AAPకు 22 సీట్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739028900317_367-normal-WIFI.webp)
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగిరింది. ఈసీ అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 70 స్థానాల్లో 48 చోట్ల బీజేపీ విజయం సాధించింది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీ 22 స్థానాలకే పరిమితమైంది. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ వరుసగా మూడో సారి ఖాతా తెరవలేకపోయింది. ఈసీ లెక్కల ప్రకారం బీజేపీ 45.66%, ఆప్ 43.57%, కాంగ్రెస్ 6.34% ఓట్లు సాధించాయి.