News February 8, 2025
చొప్పదండి: ప్రశాంతం నవోదయ ప్రవేశ పరీక్ష
చొప్పదండి జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశానికి శనివారం నిర్వహించిన అర్హత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 9వ, 11వ తరగతుల్లో ఖాళీల భర్తీకి ఈ పరీక్ష నిర్వహించారు. 1823 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 795 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ప్రవేశ పరీక్ష నిర్వహణకు సహకరించిన కలెక్టర్ పమేలా సత్పతి, డీఈవో జనార్దన్ రావులకు ప్రిన్సిపల్ మంగతాయారు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News February 8, 2025
KNR: రేషన్ కార్డు దరఖాస్తులు.. అయోమయంలో ప్రజలు!
కొత్త రేషన్ కార్డుల కోసం, ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యులను చేర్చుకునేందుకు మీ సేవలో శనివారం నుంచి దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే ప్రజా పాలన గ్రామసభలు దరఖాస్తులు ఇచ్చిన లబ్ధిదారులు మళ్లీ మీ సేవలో దరఖాస్తులు ఇవ్వాలా? లేదా? అనే అయోమయంలో ఉన్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
News February 8, 2025
ఢీల్లీ ఎన్నికల ఫలితాలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో BJP విజయం దిశగా దూసుకెళ్తోంది. అయితే, ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర సహాయ మంత్రి, KNR MP బండి సంజయ్ స్పందించారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆప్‌ను ఊడ్చేశారని అన్నారు. కుంభకోణాలు, జైలు పార్టీలు మాకు వద్దని ఢిల్లీ ప్రజలు వద్దనుకుని BJPకి పట్టం కట్టారని పేర్కొన్నారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందే ఊహించామని అన్నారు. తెలంగాణలో కూడా BJP అధికారంలోకి వస్తుందని తెలిపారు.
News February 8, 2025
భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ తాత్కాళిక రద్దు
సికింద్రాబాద్-కాగజ్‌నగర్ మధ్య రోజువారీగా రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (రైలునంబరు 17233,17234)ను ఈనెల 10 నుంచి 20 వరకు 11 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. దీంతో కరీంనగర్, పెద్దపల్లి జిల్లా ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. ఇటీవలి కాలంలో ఏ చిన్న సమస్య వచ్చినా రోజుల తరబడి రైళ్ల రాకపోకలను తాత్కాళికంగా రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహాం వ్యక్తంచేస్తున్నారు.