News February 8, 2025

ఓటర్లను ఆకర్షించిన BJP హామీలు

image

అన్ని రంగాలను ప్రభావితం చేసేలా BJP ప్రకటించిన మ్యానిఫెస్టో ఆ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించింది. మహిళలకు నెలకు రూ.2,500, పేదలకు సబ్సిడీపై రూ.500కే గ్యాస్ సిలిండర్, గర్భిణులకు రూ.21,000 ఇస్తామన్న BJPని ప్రజలు నమ్మారు. గిగ్ వర్కర్లతో పాటు వివిధ రంగాల్లో పని చేసే కార్మికులకు రూ.10లక్షల లైఫ్ ఇన్సూరెన్స్‌, ఢిల్లీలోని 1,700 అనధికార కాలనీ వాసులకు ఆస్తి హక్కులు, తదితర హామీలు ఓట్లు కురిపించాయి.

Similar News

News February 8, 2025

లిక్కర్ స్కామ్‌లో భాగమైన మూడు పార్టీలు బలి!

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో సంబంధమున్న మూడు పార్టీలు తమ రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయాయి. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ, ఢిల్లీలో ఆప్‌లు ఓటమి చవిచూశాయి. లిక్కర్ స్కామ్‌లో ఆప్ నుంచి మనీశ్ సిసోడియా, కేజ్రీవాల్, బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, వైసీపీ నుంచి మాగుంట రాఘవరెడ్డికి ఈ కేసుతో సంబంధాలు ఉన్నాయి. ఇదే కేసులో వీరందరూ ఢిల్లీ తిహార్ జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలయ్యారు.

News February 8, 2025

PHOTO: అల్లు అర్జున్ సూపర్ లుక్

image

‘పుష్ప-2’ కోసం గడ్డం పెంచిన అల్లు అర్జున్ ఈ మధ్యనే లుక్ మార్చారు. పుష్ప-2 థాంక్యూ మీట్‌లో సందడి చేసిన ఆయన గడ్డం ట్రిమ్ చేసి మరింత స్టైలిష్‌గా కనిపించారు. పుష్ప-2 రిలీజ్ తర్వాత పలు ఘటనలతో ఆయన మీడియాకు దూరమయ్యారు. ఈ క్రమంలో తాజా లుక్ అదిరిపోయిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆయన తదుపరి చిత్రంపై ప్రకటన మార్చిలో వచ్చే అవకాశముంది.

News February 8, 2025

OFFICIAL: బీజేపీకి 48, AAPకు 22 సీట్లు

image

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగిరింది. ఈసీ అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 70 స్థానాల్లో 48 చోట్ల బీజేపీ విజయం సాధించింది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీ 22 స్థానాలకే పరిమితమైంది. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ వరుసగా మూడో సారి ఖాతా తెరవలేకపోయింది. ఈసీ లెక్కల ప్రకారం బీజేపీ 45.66%, ఆప్ 43.57%, కాంగ్రెస్ 6.34% ఓట్లు సాధించాయి.

error: Content is protected !!