News February 8, 2025

ఇవాళ ‘పుష్ప-2’ థాంక్యూ మీట్

image

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప-2’ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఓటీటీలోకి వచ్చేసిన ఈ మూవీ టాప్ ప్లేస్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో ఇవాళ ‘థాంక్యూ మీట్’ నిర్వహించనున్నట్లు మూవీ యూనిట్ పోస్ట్ చేసింది. సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.

Similar News

News March 28, 2026

IPL రికార్డ్స్.. ఈసారైనా బద్దలవుతాయా?

image

☛ ఒకే సీజన్‌(2016)లో కోహ్లీ రన్స్-973
☛ పుణే వారియర్స్‌పై గేల్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోర్-175*, ఫాస్టెస్ట్(30 బంతుల్లో) సెంచరీ, ఒకే ఇన్నింగ్సులో హయ్యెస్ట్ సిక్సులు-17
☛ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్(12 పరుగులిచ్చి 6 వికెట్లు.. అల్జారీ జోసెఫ్-MI)
☛ అత్యధిక టీమ్ స్కోర్- 287/3(SRH)
☛ ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం-229 రన్స్(2016లో గుజరాత్ లయన్స్‌పై కోహ్లీ-ABD నెలకొల్పారు)

News March 28, 2026

ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ఫీజు పెంపు.. మరో 4 రోజుల్లో అమల్లోకి

image

ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ఫీజు రూ.3,000 నుంచి రూ.3,075కి పెరగనుంది. ఫీజు పెంపు నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని NHAI వెల్లడించింది. ప్రస్తుత ధరతో పాస్‌ను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు మరో 4 రోజులే అవకాశం ఉందని పేర్కొంది. వన్ టైమ్ పేమెంట్‌తో ఏడాదిపాటు లేదా 200 ట్రిప్స్ ఎలాంటి అంతరాయం లేకుండా NHలపై ప్రయాణించవచ్చని తెలిపింది. రాజ్‌మార్గ్ యాత్ర యాప్ ద్వారా పాస్‌ను యాక్టివేట్ చేసుకోవాలంది.

News March 28, 2026

మోదీ-ట్రంప్ కాల్‌లో ఎలాన్ మస్క్ లేరు: కేంద్రం

image

ప్రధాని మోదీ, US ప్రెసిడెంట్ ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ కాల్‌లో ఎలాన్ మస్క్ పాల్గొన్నట్లు వచ్చిన వార్తలను కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి ఖండించారు. ఈ నెల 24న మోదీ, ట్రంప్ మధ్య మాత్రమే టెలిఫోన్ సంభాషణ జరిగిందని స్పష్టం చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై వారు మాట్లాడుకున్నారని తెలిపారు.