News February 8, 2025
బాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించాలి: KMR కలెక్టర్

మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. కలెక్టరేట్ లో పీఓ, ఏపీఓ, ఓపీఓలకు మొదటి దఫా శిక్షణా కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోసం కేటాయించిన సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు.
Similar News
News March 28, 2026
NGKL: డయల్ యువర్ డీఎం కార్యక్రమం

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో పరిసరాల గ్రామాల ప్రజలకు ఆదివారం సాయంత్రం 4.00 గంటల నుంచి 5.00 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించినట్టు డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. అమూల్యమైన సలహాలు, సూచనలు సమస్యలు ఫోన్ నంబర్ 9959226288కు సంప్రదించగలరని కోరారు.
News March 28, 2026
వికారాబాద్: టెన్త్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

వికారాబాద్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ దీపక్ తివారీ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించిన అనంతరం, చీఫ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో డ్యూటీ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. నిబంధనల ప్రకారం పరీక్షలు పారదర్శకంగా జరగాలని అధికారులకు సూచించారు.
News March 28, 2026
ఏలూరు బీఫార్మసీ విద్యార్థిని సూసైడ్.. మరో ఆయేషా మీరా కేసు కానుందా?

ఏలూరులో బీఫార్మసీ విద్యార్థిని సువర్షిణి <<19498918>>ఆత్మహత్య <<>>కేసు నీరు గార్చేందుకు ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈకేసుతో సంబంధం ఉన్న విద్యార్థిని పోలీస్ ఉన్నతాధికారి కుమార్తె అని సమాచారం. దీంతో ఆమెను తప్పించేందుకు ఒక రాజకీయ ముఖ్య నాయకుడు కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. సువర్షిణి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు చాలా కీలకం కానుంది. ఈమేరకు మరో ఆయేషామీరా కేసు కానుందా? అని చర్చ జరుగుతోంది.


