News February 8, 2025

MP మాగుంటకు మరో కీలక పదవి

image

జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ (ZRUCC) మెంబెర్‌గా ఒంగోలు MPమాగుంట శ్రీనివాసులురెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీ మాగుంట ఇప్పటికే కేంద్ర పట్టణ, గృహ వ్యవహారాల శాఖ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

Similar News

News February 8, 2025

ఒంగోలు: తాగునీటికి ఇబ్బంది కలగకుండా చూడాలి: కలెక్టర్

image

వేసవి దృష్ట్యా జిల్లాలో ఎక్కడ తాగునీటికి ఇబ్బంది కలగకుండా దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అన్సారియా స్పష్టం చేశారు. ఒంగోలులోని కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో కలెక్టర్, జేసీతో కలిసి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాలు, వార్డుల వారీగా అందుబాటులో ఉన్న నీటి వనరులను గుర్తించడంతో పాటు, ఏప్రిల్ నెల వరకు ఎంత మేర నీరు అవసరమో వాటర్ ఆడిట్ నిర్వహించాలని సూచించారు.

News February 8, 2025

ఐ లవ్ ఒంగోలు అంటూ RGV ట్వీట్

image

ఒంగోలు పోలీస్ స్టేషన్లో విచారణ అనంతరం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ‘ఐ లవ్ ఒంగోల్. ఐ లవ్ ఒంగోల్ పోలీస్ ఈవెన్ మోర్. 3 ఛీర్స్’ అంటూ పెగ్గుతో ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్‌లో ఫొటోలను మార్ఫింగ్ కేసులో ఆయన విచారణ నిమిత్తం ఒంగోలు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన విషయం తెలిసిందే.

News February 8, 2025

సుగమ్య భారత్ యాత్రను ప్రారంభించిన ప్రకాశం కలెక్టర్

image

సమాజంలో దివ్యాంగులకు కూడా నూతన అవకాశాలు కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. విభన్నుల ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుగమ్య భారత్ యాత్రను శుక్రవారం ప్రకాశం భవనం వద్ద కలెక్టర్‌తో పాటు రాష్ట్ర విభన్న ప్రతిభా వంతులశాఖ డైరక్టర్ రవిప్రకాశ్ రెడ్డి జండా ఊపి ప్రారంభించారు.

error: Content is protected !!