News February 8, 2025

కేజ్రీవాల్ ఓటమికి 2 కారణాలు: పీసీసీ చీఫ్

image

BRSతో స్నేహం, కాంగ్రెస్‌తో పొత్తు తెంచుకోవడం వల్లే ఆప్ ఓడిపోయిందని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ కూతురు కవితతో లిక్కర్ వ్యాపారం ఆరోపణలు కేజ్రీవాల్ పతనానికి పునాదులు వేశాయని చెప్పారు. అవినీతిరహిత నినాదంతో కేజ్రీవాల్ దేశస్థాయిలో ఇమేజ్ తెచ్చుకున్నారని, కానీ లిక్కర్ స్కాం దానికి తూట్లు పొడిచిందన్నారు. ఇక కాంగ్రెస్‌తో పొత్తు వద్దన్న ఆయన నిర్ణయం బీజేపీ నెత్తిన పాలు పోసిందని పేర్కొన్నారు.

Similar News

News April 1, 2026

ఐడియా చెప్పండి.. రూ.10లక్షలు గెలుచుకోండి!

image

ప్లాస్టిక్ కాలుష్యానికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ‘BIOPACKATHON 2026’ నిర్వహిస్తోంది. భూమిలో కరిగిపోయే ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఐడియాలు ఇచ్చేవారికి భారీగా బహుమతులు అందిస్తారు. మొదటి బహుమతిగా ₹10 లక్షలు, సెకండ్ రూ.7లక్షలు, మూడో స్థానంలో నిలిచినవారు రూ.5లక్షలు గెలుచుకోవచ్చు. విజేతలకు నగదుతో పాటు పరిశ్రమలతో పనిచేసే అవకాశం లభిస్తుంది. ఆసక్తి గల వారు ఏప్రిల్ 24, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

News April 1, 2026

అమరావతి బిల్లుకు కాంగ్రెస్ మద్దతు

image

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లుపై లోక్‌సభలో చర్చ జరుగుతోంది. దీనికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. ఆ పార్టీ తరఫున మాణిక్కం ఠాకూర్ ప్రకటన చేశారు. ఇక చర్చకు వైసీపీ తరఫున ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఈ బిల్లుపై చర్చకు రెండు గంటలు కేటాయించాలని టీడీపీ ఎంపీలు కోరారు. అయితే తొలుత గంట పాటు చర్చిద్దామని, తర్వాత అవసరమైతే మరో గంట పొడిగిస్తానని స్పీకర్ ఓం బిర్లా హామీ ఇచ్చారు.

News April 1, 2026

మేం ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదు: జగన్

image

AP: అమరావతికే కాకుండా రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ తాము వ్యతిరేకం కాదని ప్రెస్‌మీట్‌లో YCP చీఫ్ జగన్ స్పష్టం చేశారు. ‘అమరావతి పేరుపై అప్పులు తెచ్చి స్కామ్‌లు చేస్తున్నారు. లక్ష ఎకరాల్లో రోడ్లు, నీళ్లు, డ్రైనేజీకి రూ.2లక్షల కోట్లు కావాలి. అంత ఖర్చు చేసే స్థోమత మనకు ఉందా? ఏడేళ్లలో CBN ఖర్చు పెట్టింది రూ.8వేల కోట్లే. వీటికి అసెంబ్లీలో CBN సమాధానం చెప్పాడా?’ అని ప్రశ్నించారు.