News February 8, 2025
బెల్లంపల్లి రేంజ్‌లోనే పులి ఆవాసం!

గత 10రోజులుగా కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని అటవీ ప్రాంతం నుంచి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పరిధిలో పులి సంచరిస్తూ అడవి ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. అటవీ శాఖ అధికారి పూర్ణచందర్ ఆధ్వర్యంలో సిబ్బంది శనివారం ఉదయం కాసిపేట మండలం వరిపేట గ్రామ సరిహద్దుల్లో పులి పాదముద్రలు గుర్తించినట్లు తెలిపారు. అటవీ సమీప చేలల్లో పంటలు ఎలా కాపాడుకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News January 5, 2026
వాల్నట్స్ వీరు తినకూడదు

వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు మెదడు, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కొన్నిరకాల సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. జీర్ణ సమస్యలు, రక్తస్రావ రుగ్మతలు ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు, మూత్రపిండాల్లో రాళ్లున్నవారు, శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన వాళ్లు ఇవి తీసుకోకూడదని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
News January 5, 2026
తిరుపతిలో హాస్టల్ మేనేజర్‌పై కాంట్రాక్టర్ దాడి

తిరుపతి అర్బన్, రూరల్ MRO ఆఫీసు సమీపంలో యూత్ హాస్టల్ ఉంది. ఇక్కడ వారం క్రితం రోడ్డు వేశారు. ఈ రోడ్డు మీదుగానే హాస్టల్‌కు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ఆదివారం హాస్టల్ మేనేజర్ మోహన్ రెడ్డి వెళుతుండగా కాంట్రాక్టర్ చంద్రబాబు అడ్డుకుని దాడికి యత్నించాడు. రోడ్డుకు నీటిని పడుతుంటే ఎలా వస్తావ్ అంటూ కాంట్రాక్టర్ బూతులు తిట్టాడట. దీంతో మోహన్ SVU పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News January 5, 2026
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు సబ్సిడీ ధరతో గోధుమ పిండిని అందజేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్ వద్ద పౌరసరఫరాల శాఖ అధికారులతో కలిసి ఆమె ఈ పంపిణీని ప్రారంభించారు. ఇక నుంచి అన్ని రేషన్ షాపుల్లో ఈ ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయని, ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని జేసీ సూచించారు.


