News February 8, 2025

కర్రివలసలో వ్యక్తి ఆత్మహత్య

image

పాచిపెంట మండలం కర్రివలస గ్రామంలో దాసరి శంకరరావు(35) ఆత్మహత్య చేసుకున్నారని ఏఎస్సై బి.ముసలినాయుడు తెలిపారు. శనివారం మాట్లాడుతూ.. భార్యభర్తల మధ్య గొడవల కారణంగా శంకరరావు శుక్రవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసి విజయనగరం మహారాజ ఆసుపత్రికి రిఫర్ చేశారని, అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారన్నారు. భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News February 8, 2025

ఎద్దు దాడిలో గాయపడ్డ వృద్ధుడు మృతి

image

నర్సీపట్నం మున్సిపాలిటీ బీసీ కాలనీలో బుధవారం జరిగిన ఎద్దు దాడిలో గాయపడ్డ గీశాల కన్నయ్య అనే వృద్ధుడు విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. ఎద్దు చేసిన దాడిలో కన్నయ్యకు కాలు, చెయ్యి విరిగిపోయాయి. మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ తరలించాలని ఏరియా ఆసుపత్రి వైద్యులు రిఫర్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News February 8, 2025

పెద్దపల్లి: ఈనెల 10 నాటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

image

ఈనెల 10న పెద్దపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు పెద్దపల్లి కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ప్రజలు దీనిని గమనించి సోమవారం కలెక్టరేట్‌కు రావొద్దని ఆయన సూచించారు.

News February 8, 2025

మంచిర్యాల జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

*బెల్లంపల్లిలో బీరు సీసాలతో దాడి.. నలుగురిపై కేసు *బెల్లంపల్లి రేంజ్ లోనే పులి ఆవాసం *వింత బారిన పడుతున్న కుక్కలు*వేలాల గిరి ప్రదక్షిణకు ఆర్టీసి బస్సు సౌకర్యం *ఢిల్లీలో గెలుపు పట్ల జిల్లాలో బీజేపీ శ్రేణుల సంబరాలు.

error: Content is protected !!