News February 8, 2025
ఢిల్లీలో బీజేపీ గెలుపు చరిత్రాత్మకం: చంద్రబాబు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735559081539_893-normal-WIFI.webp)
AP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం చరిత్రాత్మకమని సీఎం చంద్రబాబు అన్నారు. మోదీపై నమ్మకంతోనే ఢిల్లీ ప్రజలు బీజేపీని గెలిపించారని చెప్పారు. ‘ఢిల్లీలో రాజకీయ, వాయుకాలుష్యాన్ని ఆప్ సర్కార్ పట్టించుకోలేదు. చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఈ సమస్య నుంచి బీజేపీ గట్టెక్కిస్తుందని ప్రజలు నమ్మారు. భారత్‌కు సరైన సమయంలో వచ్చిన సరైన నాయకుడు మోదీ’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News February 9, 2025
ఒంటరిగా ఉంటున్నారా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739018788670_746-normal-WIFI.webp)
దీర్ఘకాలిక ఒంటరితనం శారీరక, మానసిక సమస్యలకు దారితీస్తుందని, ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను చూపుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ‘ఒంటరిగా ఉంటే.. మరణించే ప్రమాదం 29% పెరుగుతుంది. రోజుకు 15 సిగరెట్లు తాగడం కంటే ఎక్కువ ప్రమాదం. గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్, జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం ఎక్కువ. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. ఆందోళన పెరుగుతుంది’ అని అధ్యయనాలు చెబుతున్నాయి.
News February 9, 2025
రోహిత్ శర్మ రాణించాలని అభిమానుల పూజలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739032672991_1323-normal-WIFI.webp)
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్‌శర్మ తిరిగి ఫామ్ అందుకోవాలని అభిమానులు పూజలు చేస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్ తిరిగి పుంజుకునేలా అతనిని ఆశీర్వదించాలని భగవంతుడుని ప్రార్థిస్తున్నారు. దేవుడి దగ్గర రోహిత్ ఫొటోలు పెట్టి ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నెల 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే.
News February 8, 2025
ఢిల్లీ నుంచి గల్లీకి చేరిన కేజ్రీవాల్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739031661365_1323-normal-WIFI.webp)
నిన్నటివరకు మోదీకి ఎదురునిలిచే నేతల్లో కేజ్రీవాల్ ఒకరు. ప్రస్తుతం మాత్రం ఆప్‌తో పాటు తానూ ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో పరిస్థితి తలకిందులుగా మారింది. పంజాబ్‌లో అధికారంతో పాటు పలురాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు గెలిచి జోరుమీదున్న ఆప్‌కు ఢిల్లీ ఓటమి కోలుకోలేని దెబ్బ. లిక్కర్ స్కాం,శీశ్‌మహాల్, యమున నది కలుషితం తదితర అంశాలతో పాటు సొంత పార్టీ నేతల్లో వ్యతిరేకత తదితర అంశాలు కేజ్రీవాల్ ఓటమికి కారణమయ్యాయి.