News February 8, 2025

కాగజ్‌నగర్: కావేటి సమ్మయ్యను గుర్తు చేసుకున్న KTR

image

తెలంగాణ భవన్‌లో శనివారం సిర్పూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ బలోపేతంపై చర్చించారు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్  కేవలం 10 ఎమ్మెల్యే స్థానాలు గెలిచినప్పుడు సిర్పూర్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరిందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమానికి కావేటి సమ్మయ్య సేవలు మరువలేనివన్నారు. 

Similar News

News March 15, 2026

నూజివీడు: మటన్ నకిలీ అయితే!

image

నూజివీడు పట్టణంలో అధికారుల ఉదాసీన వైఖరి కారణంగా మాంసం విక్రయాలలో నిర్ధారణ కొనసాగడం లేదని మాంసప్రియలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాంసం నాణ్యతను పరిశీలించి నిర్ధారించిన మీదట మునిసిపల్ సీలు వేసే వారని తెలిపారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకపోవడం వలన ఏది నకిలీ, ఏది నాణ్యతఉన్న మాంసమో తెలియని దుర్భర స్థితి ఏర్పడిందని పట్టణ ప్రజలు వాపోతున్నారు. మాంసంపై నాణ్యత ముద్ర వేయాలని ప్రజలు కోరారు.

News March 15, 2026

కర్నూలు: నకిలీ మెసేజ్‌లతో జాగ్రత్త!

image

విద్యుత్ బిల్లుల పేరుతో వినియోగదారులకు వస్తున్న నకిలీ సందేశాలను నమ్మవద్దని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి సూచించారు. బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే విద్యుత్ నిలిపివేస్తామని హెచ్చరిస్తూ కొందరికి నకిలీ మెసేజ్‌లు వస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి సందేశాలను నమ్మి ఎవరూ మోసపోవద్దని కోరారు. విద్యుత్ సేవలకు సంబంధించిన సమాచారం అధికారిక మార్గాల్లోనే అందిస్తామని చెప్పారు.

News March 15, 2026

WGL: పెళ్లి చేసుకోవాల్సిన యువతికి HIV రక్తం ఎక్కించాడు.. ట్విస్ట్ ఇదే

image

HYD పోచారంలో పెళ్లి చేసుకోవాల్సిన <<19386582>>యువతి<<>>కి HIV రక్తం ఎక్కించిన విషయం తెలిసిందే. జనగామ జిల్లాకు చెందిన ఓ యువకుడి(24) కుటుంబం 25 కేళ్ల క్రితం ఘట్కేసర్ పరిధి అన్నోజిగూడలో నివాసముంటుంది. ట్రాన్స్‌పోర్ట్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న యువకుడు వరుసకు మరదలైన యువతి(20)ని ప్రేమించిగా పెళ్లికి పెద్దలు సిద్ధమయ్యాడు. కాగా అతడి తండ్రి కొన్నేళ్ల క్రితం HIVతో చనిపోవడం, యువకుడికి HIV ఉందని తేలడంతో పెళ్లి రద్దైంది.