News February 8, 2025
కొందరు వెన్నుపోటు పొడిచారు: తమన్

తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నా కెరీర్‌లో నేను ఎంతోమందిని నమ్మి మోసపోయా. వారు నాకు వెన్నుపోటు పొడిచారు. నా ఎదుట మంచిగా ఉండి.. పక్కకు వెళ్లగానే నా గురించి చెత్తగా మాట్లాడేవారు. కొందరిని నమ్మి ఎంతో డబ్బు పోగొట్టుకున్నా. వీటన్నిటి నుంచి జీవిత పాఠాలు నేర్చుకున్నా. ఎప్పుడైనా ఒత్తిడికి గురైతే వెంటనే గ్రౌండ్‌కు వెళ్లి క్రికెట్ ఆడతా’ అని చెప్పుకొచ్చారు.
Similar News
News March 24, 2026
ధురంధర్-2పై రజినీకాంత్ ప్రశంస.. దర్శకుడికి సూపర్‌స్టార్ మూమెంట్!

ధురంధర్-2 ప్రతీ భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అని సూపర్‌స్టార్ రజినీకాంత్ అన్నారు. దర్శకుడు ఆదిత్య ధర్ ‘బాక్సాఫీస్ కా బాప్’ అంటూ ప్రశంసించారు. హీరో రణ్‌వీర్ సహా మూవీ టీమ్‌కు అభినందనలు తెలిపారు. ఈ పోస్ట్‌పై ఆదిత్య స్పందిస్తూ.. ‘మేమందరం మీ సినిమాలు చూస్తూ పెరిగాం. ఆరాధ్య హీరోగా భావించే మీ నుంచి ప్రశంసలు అందుకోవడం నా జీవితంలో మర్చిపోలేని సూపర్‌స్టార్ మూమెంట్’ అని సంతోషం వ్యక్తం చేశారు.
News March 24, 2026
టమాటా.. కిలో రూపాయి!

APలో టమాటా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. నిన్న నంద్యాల(D) ప్యాపిలి మార్కెట్‌లో KG రూపాయి నుంచి ₹3 మాత్రమే పలికింది. ఓ రైతు 105 బాక్సుల(ఒక్కోటి 25KGలు) టమాటాను తీసుకెళ్తే వ్యాపారి బాక్సుకు ₹35 చొప్పున లెక్కగట్టి కమీషన్లు మినహాయింపు ₹2K ఇచ్చారు. దీంతో రవాణా ఖర్చులూ రాలేదని అతను వాపోయారు. చిత్తూరు(D) పలమనేరులో KG ₹3-7, మదనపల్లెలో ₹7, అనంతపురం(D) ఉరవకొండలో ₹2-3, కక్కలపల్లిలో ₹3-7 పలికింది.
News March 24, 2026
పశువుల మేతగా అజొల్లాతో ఎన్నో లాభాలు

అజొల్లాలో అధికంగా మాంసకృత్తులు, తక్కువగా లిగ్నిన్ ఉండటం వల్ల పశువులు వీటిని తేలికగా జీర్ణం చేసుకుంటాయి. 2kgల అజొల్లా ఒక కిలో దాణాతో సమానం. 2kgల అజొల్లాను రోజూ దాణాతో కలిపి పశువులకు పెడితే వాటి ఆరోగ్యం బాగుండి, పాల ఉత్పత్తి 15-20 శాతం వరకు పెరుగుతుంది. అజొల్లాలో ఉండే అమైనో ఆమ్లాలు, విటమిన్ ఏ, విటమిన్ బి12, బీటా కెరోటిన్లు, కాల్షియం, భాస్వరం, ఇనుము, రాగి, మెగ్నీషియం పోషకాలు పశువులకు మేలు చేస్తాయి.


