News February 8, 2025

నల్గొండ పోలీసులకు తలనొప్పిగా పిల్లి కేసు!

image

పిల్లి పెట్టిన లొల్లి NLG పోలీసులకు తలనొప్పిగా మారింది. స్థానిక రహమత్ నగర్‌కు చెందిన పుష్పలత పెంచుకుంటున్న పిల్లి ఏడాదిక్రితం తప్పిపోగా PSలో ఫిర్యాదు చేశారు. పక్కింట్లో అదే పోలికలతో ఉన్న పిల్లి కనిపించగా ఆపిల్లి తమదేనని, పక్కింటి వారు ఎత్తుకెళ్లారంటూ Jan15న 2టౌన్‌ PSలో పుష్పలత కేసు పెట్టింది. పోలీసులు పిల్లి వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిచారు. పిల్లి ఎవరికి చెందుతుందో తేలాల్సి ఉంది.

Similar News

News February 8, 2025

17 మంది అభ్యర్థులు-23 సెట్ల నామినేషన్లు

image

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి నామినేషన్లు ఊబందుకున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 13 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 17 మంది అభ్యర్థులు 23 సెట్లు నామినేషన్లు వేశారు. ఈరోజు, రేపు సెలవు ఉండడంతో నామినేషన్‌కు 10న ఒక్క రోజే గడువు ఉంది.

News February 8, 2025

నల్గొండ: ఉచిత శిక్షణ.. ఆపై ఉద్యోగం

image

స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో నిరుద్యోగ యువతీయువకులకు ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగం కల్పిస్తామని సంస్థ డైరెక్టర్ లక్ష్మీ ఓ ప్రకటనలో తెలిపారు. అకౌంట్స్ అసిస్టెంట్ (ట్యాలీ), కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్, ఆటోమొబైల్, టూ-వీలర్ సర్వీసింగ్, సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్, సోలార్ సిస్టం ఇన్స్టాలేషన్‌ కోర్సుల్లో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవచ్చని కోరారు.

News February 8, 2025

నల్గొండ: కలెక్టరేట్‌లో పందులు.. 

image

జిల్లాలోని కలెక్టరేట్ ఆవరణలో పందులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయ్. నిత్యం వివిధ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలకు ఇవి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కలెక్టరేట్‌లోనే ఈ పరిస్థితి ఉంటే ఇక మిగతా ప్రదేశాల్లో పందుల బెడద ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ప్రజలు వాపోతున్నారు. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

error: Content is protected !!