News February 8, 2025

నల్గొండ పోలీసులకు తలనొప్పిగా పిల్లి కేసు!

image

పిల్లి పెట్టిన లొల్లి NLG పోలీసులకు తలనొప్పిగా మారింది. స్థానిక రహమత్ నగర్‌కు చెందిన పుష్పలత పెంచుకుంటున్న పిల్లి ఏడాదిక్రితం తప్పిపోగా PSలో ఫిర్యాదు చేశారు. పక్కింట్లో అదే పోలికలతో ఉన్న పిల్లి కనిపించగా ఆపిల్లి తమదేనని, పక్కింటి వారు ఎత్తుకెళ్లారంటూ Jan15న 2టౌన్‌ PSలో పుష్పలత కేసు పెట్టింది. పోలీసులు పిల్లి వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిచారు. పిల్లి ఎవరికి చెందుతుందో తేలాల్సి ఉంది.

Similar News

News January 17, 2026

GHMC: 300 డివిజన్ల ‘మెగా’ రిజర్వేషన్లు.. పక్కా గణాంకాలు

image

జీహెచ్‌ఎంసీలో విలీనమైన 27 మునిసిపాలిటీలతో ఏర్పడిన 300 డివిజన్లకు ప్రభుత్వం రిజర్వేషన్ల కోటాను ఖరారు చేసింది. ఇందులో ఎస్టీలకు 5, ఎస్సీలకు 23, బీసీలకు 122 డివిజన్లు కేటాయించారు. మిగిలిన 150లో జనరల్ మహిళలకు 76, అన్‌రిజర్వ్‌డ్‌కు 74 దక్కాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎన్యూమరేషన్ బ్లాకుల (EB) ఆధారంగా ఎస్సీ, ఎస్టీ జనాభాను క్రోడీకరిస్తూ వార్డుల వారీ కేటాయింపుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

News January 17, 2026

గద్వాల్: జోగులాంబ వార్షిక బ్రహ్మోత్సవాలకు కలెక్టర్‌కు ఆహ్వానం

image

అలంపూర్‌లోని శ్రీ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 19 నుంచి 23 వరకు నిర్వహించనున్న నేపథ్యంలో శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఆలయ ఈవో దీప్తి జిల్లా కలెక్టర్ బీఎం.సంతోష్‌కు ఆహ్వాన పత్రికను అందజేశారు. అలాగే ఫిబ్రవరి 14 నుంచి 18 వరకు నిర్వహించు శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి మహాశివరాత్రి మహోత్సవాలకు కూడా రావాల్సిందిగా కలెక్టర్‌ను ఆలయ ఈవో కోరారు.

News January 17, 2026

కామారెడ్డి: మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు

image

కామారెడ్డి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల వార్డు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. శనివారం ఐడీఓసీలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా వీటిని ఖరారు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పూర్తి పారదర్శకంగా రిజర్వేషన్లు కేటాయించినట్లు కలెక్టర్ వెల్లడించారు. దీంతో ఆయా వార్డుల్లో ఎన్నికల సందడి మొదలైంది.