News March 19, 2024
స్కిల్ కేసులో అచ్చెన్నాయుడుని చేర్చిన సీఐడీ
AP: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అచ్చెన్నాయుడిని సీఐడీ ఏ38గా చేర్చింది. దీంతో ముందస్తు బెయిల్ కోసం అచ్చెన్నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది. కాగా ఈ కేసులో చంద్రబాబు బెయిల్‌ని రద్దు చేయాలంటూ సీఐడీ వేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌కి వాయిదా వేసింది.
Similar News
News January 9, 2025
CTET ఫలితాలు విడుదల
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్-2024 ఫలితాలు విడుదలయ్యాయి. గత నెల 31వ తేదీన కీని విడుదల చేసి, జనవరి 1 నుంచి 5వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించారు. అభ్యర్థులు రోల్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఫలితాల కోసం ఇక్కడ <
News January 9, 2025
‘భూభారతి’కి గవర్నర్ గ్రీన్‌సిగ్నల్
TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘భూభారతి’ చట్టానికి గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదం తెలిపారు. వీలైనంత త్వరగా చట్టాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన ధరణి చట్టాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతికి రూపకల్పన చేసిన విషయం తెలిసిందే.
News January 9, 2025
ఢిల్లీని గాలికొదిలేసిన గాంధీలు.. మీ కామెంట్!
సోనియా కుటుంబానికి తెలియకుండా కాంగ్రెస్‌లో చీమైనా చిటుక్కుమనదు! అలాంటిది ఎన్నికల షెడ్యూలు వచ్చినప్పటికీ రాహుల్, ప్రియాంకా గాంధీలు ఢిల్లీ దంగల్‌ను పట్టించుకోవడమే లేదు. AAP, BJP పోటాపోటీగా దూసుకెళ్తుంటే క్యాంపెయిన్ వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, ఇతర అంశాల్లో కాంగ్రెస్ వెనకబడింది. అగ్రనేతలెవరూ కానరావడం లేదు. RG ఎక్కడున్నారో తెలియదు. వారి తీరు ఓడిపోయే మ్యాచుకు ఆర్భాటం అనవసరం అన్నట్టుగానే ఉందా? మీ COMMENT