News February 8, 2025

కూకట్‌పల్లిలో వివాహిత SUICIDE

image

ఆర్థిక ఇబ్బందులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కూకట్ పల్లి పీఎస్ పరిధిలోని సుమిత్రానగర్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ దీక్షిత తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బీశెట్టి కనక రత్నమ్మ (46) ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి భర్త సత్తిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

Similar News

News March 16, 2026

HYD: ఎమ్మెల్యే సాబ్.. లొల్లిజేశైనా సమస్య తెంపు!

image

‘‘పార్టీ ఏదైనా హైదరాబాద్ ప్రజలు మిమ్మల్ని నాయకుడిగా ఆదరించారు. సిటీ సమస్యలను పరిష్కరిస్తారనే ఆశతోనే మీకు ఓటు వేశారు. ఇప్పటికి రెండు సంవత్సరాలు పూర్తి అయ్యాయి. సిటీలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ రోజు జరిగే అసెంబ్లీలో మీరు (సిటీ ఎమ్మెల్యేలు) గళం విప్పితే సర్కారు వింటుంది. అపుడు సమస్యలు పరిష్కారమయ్యేందుకు వీలుంటుంది. అందుకే MLA సాబ్ సభలో లొల్లిజేశైనా సమస్యను తెంపు’ అని నగరవాసులు కోరుతున్నారు.

News March 16, 2026

ఈ సినిమాలకు ‘ఆస్కార్’ దాసోహం

image

అసాధారణ ప్రతిభకు ‘ఆస్కార్’ అవార్డులు దాసోహమయ్యాయి. 13 నామినేషన్లతో బరిలోకి దిగిన ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ ఉత్తమ చిత్రం, దర్శకుడితో సహా 6 అవార్డులను కొల్లగొట్టింది. 16 నామినేషన్లతో చరిత్ర సృష్టించిన ‘సిన్నర్స్’ 4 అవార్డులు గెలుచుకోగా, ‘ఫ్రాంకెన్‌స్టైన్’ 3 సాంకేతిక అవార్డులను దక్కించుకుంది. ఇక ‘కెపాప్ డీమన్ హంటర్స్’ నామినేట్ అయిన 2 విభాగాల్లోనూ విజయం సాధించి 100% రిజల్ట్‌తో అదరగొట్టింది.

News March 16, 2026

10వ తరగతి పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌ మృతి

image

కర్నూలు జిల్లాలో పదో తరగతి పరీక్షల వేళ మొదటి రోజు విషాద ఘటన జరిగింది. కర్నూలులోని పరీక్ష కేంద్రం శ్రీ చైతన్య పాఠశాలకు చీఫ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న షేక్ అన్వర్ బాషా అకస్మాత్తుగా మృతి చెందారు. గ్యాస్ట్రిక్ సమస్యతో ఆయన అస్వస్థతకు గురవగా సిబ్బంది పరీక్ష కేంద్రం సమీపంలోని అమ్మ హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్‌లో మృతి చెందినట్లు డీఈవో కార్యాలయం ధ్రువీకరించింది.