News February 8, 2025
పాడేరు: ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి

ఆకాంక్ష జిల్లాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు సుమన్ కుమార్ బేరీ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో ఆకాంక్ష బ్లాక్‌ల అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. మారుమూల గ్రామాలు మరింత వేగంగా అభివృద్ధి చెందాలన్నారు. వైద్య ఆరోగ్య సేవలు, పోషకాహారం, వ్యవసాయం నీటిపారుదల సదుపాయాలు, ఆర్థిక చేకూర్పు, నైపుణ్యాభివృద్ధి మారుమూల గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు.
Similar News
News March 8, 2026
నిర్మల్: ‘ప్రజాపాలన’లో 341 ఫైళ్ల పరిష్కారం..!

రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్మల్ జిల్లాలో పారిశుద్ధ్య, ఫైళ్ల పరిష్కార డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోంది. తాజా నివేదిక ప్రకారం.. జిల్లావ్యాప్తంగా ఏకంగా 48,673 కిలోల ఘన వ్యర్థాలను అధికారులు తొలగించారు. 1,044 ప్రభుత్వ కార్యాలయ భవనాలను శుభ్రం చేశారు. అంతేకాకుండా, పరిపాలనను వేగవంతం చేస్తూ పెండింగ్‌లో ఉన్న 341 ఫైళ్లను ఒకేరోజు పరిష్కరించారు.
News March 8, 2026
సెక్షన్ 22-A, డాటెడ్ లాండ్స్ అభ్యర్థనలపై కలెక్టర్ సమీక్ష

పుట్టపర్తి కలెక్టరేట్‌లో రెవెన్యూ విభాగానికి సంబంధించిన సెక్షన్ 22-A నిషేధిత భూముల జాబితా శుద్ధి, డాటెడ్ లాండ్స్ అభ్యర్థనలపై కలెక్టర్ శ్యాంప్రసాద్ శనివారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో 22-A మార్పులకు 453 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. అదేవిదంగా డాటెడ్ లాండ్స్‌కు సంబంధించి 281 అభ్యర్థనలు అందగా, వాటిలో ఎక్కువ అభ్యర్థనలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని ఆదేశించారు.
News March 8, 2026
ఈ ఏడాది కరెంట్ ఛార్జీల పెంపు లేదు: SPDCL CMD

TG: ఈ ఏడాది కరెంట్ ఛార్జీల పెంపు ఉండదని SPDCL CMD జితేశ్.వి.పాటిల్ స్పష్టం చేశారు. SPDCL పరిధిలో మొత్తం 1.20 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారని, గతేడాదితో పోలిస్తే 12.09L మంది పెరిగారని వెల్లడించారు. ‘గృహాజ్యోతి’ పథకం వల్ల విద్యుత్ చౌర్యం తగ్గిందన్నారు. ఈ ఏడాది FEB వరకు 5.44కోట్ల జీరో బిల్లులు జారీ చేయగా, ప్రభుత్వం నుంచి రూ.1930.66కోట్ల సబ్సిడీ డబ్బులు వచ్చాయని తెలిపారు.


