News February 8, 2025

కూకట్‌పల్లిలో తూ.గో జిల్లా వివాహిత SUICIDE

image

ఆర్థిక ఇబ్బందులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కూకట్ పల్లి పీఎస్ పరిధిలోని సుమిత్రానగర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై దీక్షిత తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బీశెట్టి కనక రత్నమ్మ (46) ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి భర్త సత్తిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

Similar News

News November 6, 2025

జంట జలాశయాల వద్ద అక్రమ నిర్మాణాలపై పిల్ దాఖలు

image

ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల పరివాహక ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో పిల్ దాఖలైంది. మాధవరెడ్డి ఈ పిల్ దాఖలు చేయగా.. మరొక పిటిషనర్ ఇంప్లీడ్ అయ్యారు. ఈ జలాశయాలు నగరానికి ఎంతో ముఖ్యమని పిటిషనర్ల న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

News November 6, 2025

సినిమా అప్డేట్స్

image

* సందీప్‌రెడ్డి-ప్రభాస్ కాంబోలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ చిత్రంలో దగ్గుబాటి అభిరామ్ కీలక పాత్ర పోషిస్తారని సమాచారం.
* అమన్ కౌశిక్ డైరెక్షన్‌లో విక్కీ కౌశల్ హీరోగా ‘మహావతార్’ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. పరశురాముని పాత్రలో నటిస్తోన్న విక్కీ.. నాన్ వెజ్ మానేయాలని నిర్ణయించుకున్నట్లు టాక్.
* కల్కి-2లో హీరోయిన్ పాత్ర కోసం ఆలియా, సాయిపల్లవి, అనుష్క, కల్యాణి ప్రియదర్శన్ పేర్లు తెరపైకి వచ్చాయి.

News November 6, 2025

బెల్లంపల్లి: రైలు కింద పడి సాప్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

image

బెల్లంపల్లి- రేచిని రోడ్ రైల్వేస్టేషన్ల మధ్య గురువారం ఉదయం గుర్తుతెలియని రైలు కింద పడి కన్నాల బస్తీకి చెందిన సిలువేరు రవితేజ అనే సాప్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహం విషయంలో కుటుంబ అంతర్గత కలహాలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జీఆర్పీ ఎస్సై మహేందర్ ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.