News February 8, 2025

రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల రూపాయల రుణమాఫీ చేసింది: మంత్రి సీతక్క

image

ములుగు మండలం ఇంచర్లలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ అధ్యక్షతన ములుగు, వెంకటాపూర్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి సీతక్క హాజరై మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. రైతులను ఆదుకోవాలన్న లక్ష్యంతో రూ.2లక్షల రుణమాఫీ చేసిందని మంత్రి సీతక్క అన్నారు.

Similar News

News April 1, 2026

సంగారెడ్డి: గురుకుల కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

image

గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని సీఓఈ గురుకులాల్లో ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు రీజినల్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు తెలిపారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ నెల 7లోపు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి ఈ నెల 19న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. అర్హులైన గిరిజన విద్యార్థులు www.tgtwreis.telangana.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News April 1, 2026

ఇరాన్‌ యుద్ధం.. అమెరికాతో విభేదించిన బ్రిటన్

image

ఇరాన్ యుద్ధం విషయంలో <<19525908>>అమెరికా<<>>తో బ్రిటన్ విభేదించింది. ఈ ఘర్షణల్లోకి ప్రవేశించేది లేదని PM స్టార్మర్ తేల్చి చెప్పారు. యుద్ధంతో సంబంధం లేనప్పటికీ.. తమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఘర్షణల్ని ఆపేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు. హార్ముజ్ పున:ప్రారంభానికి ఉన్న మార్గాల్ని అన్వేషించేందుకు గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామని తెలిపారు.

News April 1, 2026

విశాఖ రైల్వే డివిజన్‌కు మరో రికార్డు

image

వాల్తేరు రైల్వే డివిజన్ మరోసారి రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా అత్యధిక ఆదాయం సాధించిన డివిజన్లలో 5వ స్థానం, వృద్ధిలో తొలి స్థానం దక్కించుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 85.1 మిలియన్ టన్నుల లోడింగ్‌తో 17.25% వృద్ధి నమోదైంది. మొత్తం ఆదాయం రూ.11,598 కోట్లకు చేరి 17% పెరిగింది. ప్రయాణికుల సంఖ్య 33.42Mకి చేరగా రూ.881 కోట్ల ఆదాయం లభించింది. ఈ వివరాలను వాల్తేరు డివిజన్ DRM లలిత్ బోహ్రా వెల్లడించారు.