News February 8, 2025
వయోవృద్ధులకు ప్రాధాన్యత ఇవ్వాలి: డీఆర్వో గణేశ్
వయో వృద్ధులకు తప్పనిసరిగా తగిన ప్రాధాన్యతను ఇవ్వాలని హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి విగణేశ్ అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాస్థాయి వయోవృద్ధుల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి గణేశ్ మాట్లాడుతూ.. వయోవృద్ధులను గౌరవించడం, వారి సంక్షేమం కోసం జిల్లా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.
Similar News
News February 9, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 9, 2025
CCL: తెలుగు వారియర్స్ ఓటమి
సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో కర్ణాటక బుల్డోజర్స్తో మ్యాచులో తెలుగు వారియర్స్ 46 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 113/3 స్కోర్ చేయగా, తెలుగు టీమ్ 99/5 చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో బుల్డోజర్స్ 123/3 స్కోర్ సాధించగా, వారియర్స్ 91/9కే పరిమితమై పరాజయం పాలైంది. KA జట్టులో డార్లింగ్ కృష్ణ 38 బంతుల్లోనే 80 రన్స్ చేసి రాణించారు.
News February 9, 2025
అరుణాచలం గిరి ప్రదక్షిణకు ఆర్టీసీ ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్: డిపో మేనేజర్
తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్ నడుపుతున్నట్లు RTC WGL-1 డిపో మేనేజర్ వంగల మోహన్ రావు తెలిపారు. ఈనెల 10న మధ్యాహ్నం 3 గంటలకు హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి బయలు దేరుతుందని తెలిపారు. చార్జీలు పెద్దలకు రూ.4500, పిల్లలకు రూ.3వేలుగా నిర్ణయించినట్లు తెలిపారు. వివరాలకు 9959226047, 9494107944 నెంబర్లో సంప్రదించాన్నారు.